విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు కొవిడ్ వ్యాక్సిన్..!

లాక్ డౌన్ కొనసాగింపుతో పాటుగా మిగతా అంశాల మీద తెలంగాణా కేబినెట్ మీటింగ్ పూర్తయింది.సిఎం కే.

 Vaccine For Students Who Goes To Abroad To Studies, Corona, Covid Vaccine, Ktr,-TeluguStop.com

సి.ఆర్ అధ్యక్షతన పలు అంశాలపై చర్చించారు.ప్రగతి భవన్ లో జరిగిన ఈ కేబినెట్ భేటిలో లాక్ డౌన్ ను మరో 10 రోజుల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.అంతేకాదు ఇదివరకు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకే మినహాయింపు ఉండగా దాన్ని మరో 3 గంటల పాటు పొడిగించారు.అంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్ డౌన్ మినహాయింపు ఇచ్చారు.1 తర్వాత 2 గంటల వరకు ప్రజలు గమ్య స్థానాలకు చేరుకునేలా పర్మిషన్ ఇచ్చారు.

ఇక నేటి కేబినెట్ భేటీలో ఇతర అంశాలపై చర్చించారు.ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విధ్యార్ధులకు ప్రాధాన్యత కల్పిస్తూ ముందుగా వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు.

వారు సురక్షితంగా ప్రయాణం చేసేందుకు వీలుగా వారికి ముందు వ్యాక్సిన్ వేయించే ఏర్పాటు చేస్తున్నారు.దీనికి సంబందించిన కార్యచరణ విధివిధానాలు త్వరలో తెలియచేస్తారని తెలుస్తుంది.అంతేకాదు రాష్ట్రంలో 7 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ తీర్మానం చేసింది. జగిత్యాల, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, కొత్తగూడెం, సంగారెడ్డి, ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.2014 నుండి 18 వరకు తెలంగాణాలో 4 వైద్య కళాశాలలే నిర్మతమయ్యాయి.ఇప్పుడు మరో 7 కళాశాలలు నిర్మిస్తున్నాని కే.

టి.ఆర్ చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube