ప్రయోగాలు చేస్తేనే గుర్తింపు.. లేదంటే అలానే ఉండిపోతాం.. వాణీ కపూర్ కామెంట్స్ వైరల్!

ఆయుష్మాన్ ఖురానా, వాణీ కపూర్ జంటగా నటించిన చిత్రం చండీగఢ్ కరే ఆషీకీ. ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు.

 Vaani Kapoor Paints The Town Red In Short Strap Less Balloon Dress Details,  Van-TeluguStop.com

ఈ సినిమా తాజాగా డిసెంబర్ 10న విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమాను ఎల్ జిబిటిక్యూ కథాంశంతో తెరకెక్కించారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ను అందుకుంది.అంతేకాకుండా ప్రస్తుతం థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా బాడీ బిల్డర్ గా కనిపించారు.

ఈ సినిమాలో వాణీ కపూర్ ట్రాన్స్ ఉమెన్ పాత్రలో నటించింది.

అయితే ఈ సినిమా విడుదల కాకముందు సినిమా ప్రమోషన్ లో వాణీ కపూర్ కాస్త డిఫరెంట్ ఫ్యాషన్ వేర్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్య పరిచిన విషయం అందరికి తెలిసిందే.వాణీకపూర్ ధరించిన రెడ్ కలర్ బెలూన్ దుస్తులకు సంబంధించిన ఫోటోలు తన ఇన్​స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.ఈ సినిమాలో ఆమె నటించిన ట్రాన్స్ ఉమెన్ పాత్ర గురించి చెప్పింది.

అనంతరం ఈ సినిమాలో తాను చేసిన క్యారెక్టర్ చాలా సున్నితమైనదని, ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడే జీవితంలో ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుందని, లేకపోతే అలానే ఉండిపోతాం అని తెలిపింది వాణీకపూర్.ఇక సినిమా విడుదలకు ముందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ సినిమా గురించి అందులోని పాత్రల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.అలాగే సినిమాలో కేవలం ట్రాన్స్ జెండర్ క్యారెక్టర్ ని ఎందుకు ట్రాన్స్ జెండర్ మాత్రమే చేయాలి, సమాజంలో ఉన్న ట్రాన్స్ జెండర్ ల అభిప్రాయాలను మనం గౌరవించాలి అని ఇంటర్వ్యూలో తెలిపారు.అంతేకాకుండా ప్రతి ఒక్కరు సాటి మనిషిని గౌరవించి ఆలింగనం చేసుకోవాలి అని దర్శకుడు అభిషేక్ కపూర్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube