'వి' కు ఇంకాస్త ప్రమోషన్‌ కావాల్సింది

నాని 25వ సినిమా ‘వి’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.థియేటర్లు మూతబడి ఉన్న కారణంగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘వి’ మూవీ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

 V Nani Amazon Prime Dill Raju-TeluguStop.com

అమెజాన్‌ లో రేపు స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతున్న ‘వి’ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రమోషన్‌ చేయలేదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ సినిమాకు నిర్మాత అయిన దిల్‌ రాజు సినిమా ప్రమోషన్‌ లో ఎక్కడ కూడా కనిపించలేదు.

కనీసం సోషల్‌ మీడియాలో కూడా దిల్‌ రాజు ప్రమోషన్‌ చేసినట్లుగా అనిపించలేదు.

 V Nani Amazon Prime Dill Raju-వి’ కు ఇంకాస్త ప్రమోషన్‌ కావాల్సింది-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దిల్‌ రాజు తన గత సినిమాలకు ప్రమోషన్‌ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకునేవాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అన్ని తానై ముందుండి ప్రమోషన్స్‌ చేసేవాడు.కాని ఓటీటీ విడుదల అవ్వడం వల్ల దిల్‌ రాజు మొహం చాటేశాడు.

విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనా లేదంటే మరేదైనా కారణమో కాని ఇప్పటి వరకు వి సినిమా కోసం ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం కాని బైట్‌ ఇవ్వడం కాని దిల్‌ రాజు చేయలేదు.సాదారణంగా నాని 25వ సినిమా అంటే అంచనాలు పీక్స్‌ లో ఉండాలి.

కాని ప్రమోషన్స్‌ చేయక పోవడంతో ఇంకా చాలా మందికి అమెజాన్‌ లో వి విడుదల కాబోతున్న విషయం కూడా తెలియడం లేదు.

అమెజాన్‌ వారు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నా కూడా పెద్దగా ప్రయోజనం కనిపించం లేదు.

జనాల్లోకి వెళ్లలేని ఈ పరిస్థతుల్లో మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో అయినా యాక్టివ్‌గా ప్రచారం చేస్తే బాగుండేది అనుకుంటున్నారు.కాని ఇప్పటి వరకు ‘వి’ ప్రమోషన్ విషయంలో జోరు కనిపించడం లేదు.

ఓటీటీ విడుదల కనుక పబ్లిసిటీకి ఎక్కవు ఖర్చు పెట్టవద్దని ఏమైనా మేకర్స్‌ రూల్‌ పెట్టుకున్నారేమో అనిపిస్తుంది.సుధీర్‌ బాబు పోలీస్‌ ఆఫీసర్‌ గా నటించిన ఈ సినిమాలో నివేధా థామస్‌ మరియు అదితి రావు హైదరీలు హీరోయిన్స్‌ గా నటించిన విషయం తెల్సిందే.

#Nani #Dill Raju #Sudheer Babu #Nivethe Thomas #Amazon Prime

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు