నాని V సినిమా అప్ డేట్, V అంటే విలన్ కాదట

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని ని సైలెంట్ స్టార్ అని కూడా పిలుస్తారు.ఎందుకంటే సైలెంట్ గా ఎలాంటి ఆర్భాటం లేకుండా సినిమా లుచేసి హిట్ లు కొట్టేస్తూ ఉంటాడు.

 నాని V సినిమా అప్ డేట్, V అంటే వి-TeluguStop.com

అయితే ఇటీవల వచ్చిన నాని గ్యాంగ్ లీడర్ మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది.ప్రస్తుతం నేచురల్ స్టార్ ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో V అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో నాని ఒక సైకో కిల్లర్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది.అయితే దీనితో అందరూ కూడా ఈ చిత్ర టైటిల్ V అని ఉండడం తో V అంటే విలన్ అంటూ ప్రచార కూడా చేశారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఒక ఆసక్తికర విషయం బయటపడింది.
అదే V అంటే విలన్ కాదట, ఇందులో నాని హత్య చేసిన ప్రతిసారి అక్కడ ఓ గుర్తును వదిలేసి వెళ్తాడట.

అదే ‘V’ అనే అక్షరం.అయితే దాని వెనుక ఉన్న మర్మం ఏమిటి అనే దానిపై సుధీర్ బాబు చేసే విచారణే సినిమా కథ అన్న కొత్త టాక్ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో నాని తో పాటు మరో హీరో సుదీర్ బాబు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇంద్రగంటి దర్శకత్వం లో గతంలో నాని రెండు సినిమాలు చేయగా అవి రెండూ కూడా తన కెరీర్ లో హిట్స్ గా నిలిచాయి.

అయితే ఇప్పుడు అదే ఇంద్రగంటి తో మూడో చిత్రం చేస్తున్నాడు నాని.అయితే ఇది కూడా ప్రయోగాత్మక చిత్రమే అన్నట్లు సమాచారం.బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, నివేదా థామస్, అతిథి రావు హైదరి సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.

Telugu Nani, Psycho Killer, Thriller, Teaser, Secret Revealed-Movie

ఈ సినిమా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.ఇటీవల ఈ చిత్ర టీజర్ కూడా విడుదల చేయగా, అందులోనాని చెప్పిన డైలాగులు కూడా పేలిపోయాయి.అంతేకాదు, సుధీర్ బాబు కూడా స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు.

మొత్తానికి ఈ టీజర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుందనే చెప్పాలి.అయితే V టైటిల్ వెనుక ఉన్న రహస్యం తెలియాలి అంటే తప్పకుండా సినిమా విడుదల అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube