కోర్టుకు వెళ్లిన ఉయ్యాలవాడ ఫ్యామిలీ, 50 కోట్లు ఇస్తేనే సైరా విడుదల

చిరంజీవి సైరా చిత్రంపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల పోరాటం కొనసాగుతోంది.సినిమా ప్రారంభంకు ముందు కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామంటూ నిర్మాత రామ్‌ చరణ్‌ హామీ ఇచ్చాడట.

 Uyyalawadanarasimha Reddy Family Wants Stay On The Movie-TeluguStop.com

కాని ఇప్పుడు మొహం చాటేస్తున్నాడు అంటూ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగుతున్నారు.చాలా రోజులుగా వారి ఆందోళనలు అట్టుడుకుతున్నాయి.

చిరంజీవి ఇంటి ముందు, కొణిదెల ఆఫీస్‌ ముందు ఇంకా దర్శకుడి ఆఫీస్‌ ముందు ఇలా పలు చోట్ల ఉయ్యాలవాడ ఫ్యామిలీ ఆందోళనకు దిగింది.

Telugu Nayana Tara, Ram Charan, Raa Simha Reddy, Syeraa, Tamanna, Uyyalawadasimh

  తాజాగా ఏకంగా రాష్ట్ర హైకోర్టు ముందుకు వెళ్లింది.హైకోర్టులో సైరా చిత్ర నిర్మాతలు మరియు ఇతర యూనిట్‌ సభ్యులపై ఫిర్యాదు చేయడం జరిగింది.నిర్మాత రామ్‌ చరణ్‌ తమకు 50 కోట్ల రూపాయలను ఇస్తామంటూ అగ్రిమెంట్‌ రాసి ఇచ్చి మా నుండి సినిమాకు కావాల్సిన సమాచారం తీసుకుని ఇప్పుడు మమ్ములను పట్టించుకోవడం లేదు అంటూ ఉయ్యాలవాడ ఫ్యామిలీ మెంబర్స్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడం జరిగింది.

సాయం చేయమని అడిగితే కనిపించక పోవడంపై ఉయ్యాలవాడ ఫ్యామిలీ ఆగ్రహంగా ఉంది.

Telugu Nayana Tara, Ram Charan, Raa Simha Reddy, Syeraa, Tamanna, Uyyalawadasimh

  ఈ వివాదం హై కోర్టుకు వెళ్లడంతో పరిస్థితి చేయి జారినట్లనిపిస్తుంది.నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడేందుకు ఎంత ప్రయత్నించినా కూడా 50 కోట్లు ఇవ్వాల్సిందే అంటూ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.భారీగా బడ్జెట్‌ పెరిగింది, సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్‌ జరగలేదు.

ఆ కారణంగానే నిర్మాత అంత మొత్తం ఇవ్వలేడు అంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులను మద్యవర్తులు ఒప్పించే ప్రయత్నాలు విఫలం అవ్వడంతో వారు హైకోర్టుకు చేరుకున్నారు.అక్టోబర్‌ 2న విడుదల కావాల్సిన సైరా ఈ కారణంగా ఏమైన వాయిదా పడేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube