మళ్లీ ఉయ్యాలవాడ ఫ్యామిలీ రచ్చ  

Uyyalavada Narasimha Reddy Family Argument With Saira Movie Team-saira Movie Team,uyyalavada Narasimha Reddy Family

చిరంజీవి ‘సైరా’ చిత్రం మొదలైనప్పటి నుండి కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు కొందరు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.సినిమా తీసుకునేందుకు తమ వద్ద అనుమతి తీసుకున్న చిత్ర యూనిట్‌ సభ్యులు అందుకు కావాల్సిన సమాచారంను కూడా తమ నుండి అందుకున్నారు.ఆ సమయంలో తమకు చేస్తానన్న సాయంను ఇప్పుడు మర్చిపోయారు అంటూ చాలా సార్లు ఉయ్యాలవాడ ఫ్యామిలీకి చెందిన వారు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

Uyyalavada Narasimha Reddy Family Argument With Saira Movie Team-saira Movie Team,uyyalavada Narasimha Reddy Family-Uyyalavada Narasimha Reddy Family Argument With Saira Movie Team-Saira Team

తాజాగా సైరా చిత్రం విడుదలకు సిద్దం అవుతున్న వేళ మరోసారి చిరంజీవి ఆఫీస్‌ ముందు ఉయ్యాలవాడ ఫ్యామిలీ సభ్యులు ఆందోళన మొదలు పెట్టారు.

Uyyalavada Narasimha Reddy Family Argument With Saira Movie Team-saira Movie Team,uyyalavada Narasimha Reddy Family-Uyyalavada Narasimha Reddy Family Argument With Saira Movie Team-Saira Team

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు రెండుగా విడిపోయి కొందరు మెగా కుటుంబంకు సైరాకు మద్దతు పలుకుతుంటే మరో వర్గం మాత్రం తమకు సాయం అందలేదు అనే ఉద్దేశ్యంతో మెగామూవీపై ఉద్యమంకు సిద్దం అయ్యారు.

దాంతో ప్రస్తుతం సినీ వర్గాల్లో సైరా వివాదం చర్చనీయాంశం అవుతోంది.విడుదల సమయంలో ఈ వివాదం మరింత రాజుకునే అవకాశం ఉంది.నేడు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు చిరంజీవి ఆఫీస్‌ ముందు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.వారితో చర్చలు జరిపేందుకు మెగా ఫ్యామిలీ నుండి ఎవరు ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.