సినిమా ప్రపంచాన్ని వదిలేయనున్న టీనేజ్ బ్యూటి ?

ఇంకా 16 ఏళ్ళు కూడా నిండని వయసులో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది అవికా గొర్.మొదటి సినిమా ఉయ్యాలా జంపాల బాగా ఆడటంతో అమ్మడుకి మంచి ఆఫర్లే వచ్చాయి.

 Teenage Actress To Quit Cinema Forever ?-TeluguStop.com

కాని హిందీ సీరియల్స్ లో కూడా నటించే ఆవికా, ఇటు సినిమాలు, అటు సీరియల్లు చాలా కష్టంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది.ఆ తరువాత మళ్ళీ రాజ్ తరుణ్ తోనే చేసిన “సినిమా చూపిస్తా మావ” కూడా బంపర్ హిట్ నిలిచింది.

అయినా ఎందుకో ఆవికా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.అలాగని సీరియల్స్ ప్రపంచంలో ఆవిక డిమాండ్ ఏమి తగ్గలేదు.

తెలుగు సినిమాలు కూడా అరడజను దాకా చేసింది.అయితే ఈ కెరీర్ ని బరువుగా ఫీల్ అవుతోంది అంట ఆవికా.

19 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఆవికాకి, ఒంటరిగా ఉండటం, షూటింగ్ కోసం అటు ఇటు తిరగడం, డబ్బు విషయాలు, ఇంట్లో తల్లిదండ్రులతో ఇష్యుస్ .ఇవన్ని పెద్ద తలనోప్పిలాగా అనిపిస్తున్నాయాట.అందుకే ఈ టీనేజ్ లేడి సినిమాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఇది కొంతకాలం విశ్రాంతి తీసుకొని, మళ్ళీ కెరీర్ ని మొదలుపెట్టడమా లేక పూర్తిగా సినిమాల నుంచి తప్పుకోవడమా అనేది తెలియదు.

అలాగే కేవలం షూటింగ్ ఒత్తిడి వల్లే ఆవికాకి ఇండస్ట్రీ మీద విరక్తి పుట్టిందా లేక ఏవైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా అనే విషయం కూడా బయటకి తెలియదు.చూద్దాం, అవికా భవిష్యత్తు ఆలోచనలు ఏంటో, మనసు మార్చుకుంటుందో లేక నాకొద్దు ఈ సినిమాలు అంటూ గ్లామర్ ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తుందో !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube