శర్వానంద్ కి బ్రేక్ ఇవ్వడానికి రెడీ అవుతున్న యూవీ క్రియేషన్స్  

UV Creations Two Movies Plan With Sharwanand, Darling Prabhas, UV Creations, Tollywood, Kishore Tirumala - Telugu Darling Prabhas, Kishore Tirumala, Tollywood, Uv Creations, Uv Creations Two Movies Plan With Sharwanand

ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న కుర్ర హీరో శర్వానంద్.మంచి టాలెంటెడ్ నటుడు అనే గుర్తింపు తెచ్చుకున్న ఎక్కువగా కమర్షియల్ చిత్రాల జోలికి వెళ్లకుండా కంటెంట్ ఉన్న కథలు చేస్తూ కొత్తదనం కోసం ప్రయత్నం చేసే శర్వానంద్ అలాగే సినిమాలు ఎంపిక చేసుకున్న ఎందుకనో సక్సెస్ రావడం లేదు.

 Uv Creations Two Movies Plan With Sharwanand

చేసిన సినిమాలు అన్ని కూడా ఏవరేజ్ లేదంటే డిజాస్టర్ టాక్ దగ్గరే ఆగిపోతున్నాయి.శతమానం భవతి సినిమా తర్వాత అతనికి సాలిడ్ హిట్ పడలేదు.

అయినా కూడా శర్వానంద్ చేతిలో అవకాశాలు బాగానే ఉన్నాయి.ప్రస్తుతం కొత్త దర్శకుడుతో శ్రీ కారం అనే సినిమా చేస్తున్నాడు.

శర్వానంద్ కి బ్రేక్ ఇవ్వడానికి రెడీ అవుతున్న యూవీ క్రియేషన్స్-Movie-Telugu Tollywood Photo Image

అలాగే అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్ధార్ధ్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా ఒకటి చేస్తున్నాడు.ఈ సినిమాతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.

ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది.
యూవీ క్రియేషన్స్ ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటిది.

ఈ ప్రొడక్షన్ హౌస్ లో ప్రభాస్ పెట్టుబడులు కూడా ఉన్నాయి.శర్వానంద్ ప్రభాస్ కి మంచి మిత్రుడు అనే సంగతి అందరికి తెలిసిందే.

ఈ నేపధ్యంలో ఫ్లాప్ లలో ఉన్న శర్వానంద్ కి సాలిడ్ హిట్ ఇవ్వడానికి యూవీ క్రియేషన్స్ బ్యానర్ ద్వారా అతనితో రెండు సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే శర్వానంద్ తో యూవీ రెండు సినిమాలు తెరకెక్కించింది.

ఇప్పుడు కిషోర్ తిరుమలతో మూడో సినిమా శర్వానంద్ కోసం చేస్తుంది.దీని తర్వాత మరో సక్సెస్ ఫుల్ దర్శకుడుతో శర్వానంద్ హీరగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

వీటి వెనుక ప్రభాస్ హస్తం ఉందని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.మొత్తానికి ఫ్రెండ్ కి సక్సెస్ ఇవ్వడం కోసం తన హోమ్ బ్యానర్ లోనే శర్వానంద్ కి అవకాశాలు ఇవ్వడం నిజంగా గొప్ప విషయం.

#UV Creations #Darling Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uv Creations Two Movies Plan With Sharwanand Related Telugu News,Photos/Pics,Images..