ఓటీటీ లో వరుస సినిమాలను విడుదల చేసేందుకు సిద్దమవుతున్న ప్రభాస్ సంస్థ…!  

uv creations is all set to release a series of films on ott uv creations, prabas, radheshayam, saho, teja, ravi teja - Telugu Prabas, Radheshayam, Ravi Teja, Saho, Teja, Uv Creations

ప్రభాస్ కొత్తగా చిత్ర నిర్మాణ సంస్థ ఎప్పుడు మొదలు పెట్టాడని అనుకుంటున్నారా…? అది కూడా చిన్న సినిమాలు ప్లాన్ చేసి రిలీజ్ చేయడం ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా…? అయితే అసలు విషయం ఏమిటంటే… ఇక హీరో ప్రభాస్ సాహో, రాధే శ్యామ్ సినిమాలను చేస్తున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్.ఈ నిర్మాణ సంస్థ పూర్తిగా ప్రభాస్ స్నేహితులది.దీంతో మనం ప్రభాస్ నిర్మాణ సంస్థ అని చెప్పవచ్చు.

TeluguStop.com - Uv Creations Is All Set To Release A Series Of Films On Ott

ఇకపోతే ప్రస్తుతం నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ప్రభాస్ తో కలిసి రాధే శ్యామ్ నిర్మిస్తోంది.

ఇక ఇదివరకే ఇందుకు సంబంధించిన 50 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు కూడా.ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పెద్ద సినిమాలు నిర్మించడానికి వీలు లేకపోవడంతో ఈ నిర్మాణ సంస్థ చిన్న సినిమాలు తీయడానికి ప్లాన్ చేస్తోంది.

TeluguStop.com - ఓటీటీ లో వరుస సినిమాలను విడుదల చేసేందుకు సిద్దమవుతున్న ప్రభాస్ సంస్థ…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదివరకే టాలీవుడ్ దర్శకుడు శోభన్ కుమారుడితో కలిసి ఒక సినిమాను పూర్తి చేసింది కూడా యువి క్రియేషన్స్.ఇందుకు సంబంధించి మేర్లపాక గాంధీ దర్శకుడిగా పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించారు.

ఇక ఈ సినిమా తర్వాత ఈ నిర్మాణ సంస్థ టాలీవుడ్ దర్శకుల్లో ఒకరైన మారుతి తో కలిసి మరో సినిమాని ప్లాన్ చేయబోతున్నారు.అయితే ఇందుకు సంబంధించి మాస్ మహారాజ్ రవితేజ ను హీరోగా అనుకుంటున్నారు.

కాకపోతే, ఇప్పటివరకు రవితేజ నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు.రవితేజ ఎప్పుడైతే ఈ సినిమాకి ఓకే అంటేనే వెంటనే సెట్స్ పైకి వెళ్లడానికి నిర్మాణ రంగ సంస్థ సిద్ధంగా ఉంది.

ఈ సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలను ఏకంగా పది సినిమాలను నిర్మిస్తోంది యు.వి.క్రియేషన్స్.ఇలా నిర్మించిన సినిమాలన్నీ థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి కుదరకపోతే అన్ని కూడా ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇంతవరకు పెద్ద పెద్ద సినిమాలను నిర్మించిన యువి క్రియేషన్స్ ప్రస్తుతం చిన్న సినిమాలు తీస్తుండటం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే.

#Ravi Teja #Saho #Prabas #UV Creations #Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uv Creations Is All Set To Release A Series Of Films On Ott Related Telugu News,Photos/Pics,Images..