వామ్మో.. రాధేశ్యామ్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం అన్ని కోట్లా..?

స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ బాహుబలి సిరీస్ సినిమాలతో పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే.అప్పటివరకు ప్రభాస్ టాలీవుడ్ కు మాత్రమే స్టార్ హీరోగా సుపరిచితం కాగా ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో కూడా పాన్ ఇండియా హీరోగా సత్తా చాటారు.

 Uv Creation Spending  Huge Amount For Radhe Shyam Movie Visual Effects , Radhe S-TeluguStop.com

అయితే బాహుబలి సిరీస్ సినిమాల తరువాత ప్రభాస్ పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో మాత్రమే నటిస్తారని ఫ్యాన్స్ భావించారు.కానీ ప్రభాస్ మాత్రం ఇచ్చిన మాటకు అనుగుణంగా ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్, రాధాకృష్ణలకు తన సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు.

సుజీత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా తెలుగులో ఫ్లాప్ కాగా హిందీలో మాత్రం బాగానే కలెక్షన్లను సాధించింది.మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వం వహించిన జిల్ సినిమా యావరేజ్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ రిజల్ట్ విషయంలో టెన్షన్ పడుతున్నారు.

చాలా నెలల క్రితమే షూటింగ్ మొదలై కొన్ని సన్నివేశాలు మినహా చిత్రీకరణ పూర్తైన రాధేశ్యామ్ ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

Telugu Crore Rupees, Radha Krishna, Prabhas, Radhe Shyam, Radheshyam, Uv, Visual

విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యంగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న రాధేశ్యామ్ మూవీ గురించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.రాధేశ్యామ్ నిర్మాతలు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏకంగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం.సినిమాలో క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని సమాచారం.

ఈ సినిమా కోసం నిర్మాతలు 200 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.భారీగా అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

రాధేశ్యామ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube