సైరాను పట్టేసిన సాహో టీమ్  

Uv Creation Brought Syeraa Rights-

ఖైదీ నెంబర్ 150సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సైరా సినిమాతో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.దాదాపు 200కోట్లకు పైగా బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ హిస్టారికల్ మూవీపై అంచనాలు రోజురోజుకి తారా స్థాయికి చేరుతున్నాయి.అయితే సినిమాకు సంబందించిన బిజినెస్ లో భాగమవ్వాలని పలు బడా సంస్థలు పోటీపడుతున్నాయి..

Uv Creation Brought Syeraa Rights--Uv Creation Brought Syeraa Rights-

ఆ లిస్ట్ లో ప్రభాస్ సాహో టీమ్ కూడా చేరినట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో విడుదల కాకముందేసినిమాపై క్రేజ్ రోజురోజుకి పెరుగుతోంది.అయితే యూవీ క్రియేషన్స్ ఇటీవల సాహో బిజినెస్ లో వచ్చిన కొంత డబ్బుని అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది.

సైరా రైట్స్ కోసం పలు బడా నిర్మాణ సంస్థలు పోటీపడినప్పటికీ ఫైనల్ గా భారీ రేటుకు ఏపి హక్కల్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.ఇటీవల షూటింగ్ పనులను ముగించుకున్న సైరా యూనిట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఈ నెలలో సినిమా బిజినేస్ ను క్లోజ్ చేసి ఆగస్ట్ 15న సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయాలనీ రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు.