బోల్డ్ కంటెంట్ కథతో మేర్లపాక, యువి కాంబినేషన్ లో మరో సినిమా

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వచ్చిన తర్వాత బోల్డ్ కంటెంట్ కథలకి ఎక్కువ ఆదరణ లభిస్తుంది.ఈ నేపధ్యంలోనే ఇప్పటికే హిందీలో బోల్డ్, అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ లు, సినిమాలు వస్తున్నాయి.

 Uv Concepts One More Bold Content Movie With Merlapaka Story, Tollywood, Ek Mini-TeluguStop.com

అయితే తెలుగులో మాత్రం అడల్ట్ కంటెంట్ జోనర్ లో సినిమాలు రావడం చాలా తక్కువ.అయితే యు.

వి.క్రియేషన్స్ నిర్మాతలు కొత్తగా యు వి కాన్సెప్ట్స్ అనే బ్యానర్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ బ్యానర్ పై తక్కువ బడ్జెట్ లో కొత్త దర్శకులతో ఇంట్రెస్టింగ్ కథలను తెరకెక్కించడానికి యూవీ నిర్మాతలు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే సంతోష్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధీ అందించిన కథతో ఏక్ మినీ కథ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఈ మూవీ బోల్డ్ కాన్సెప్ట్ తో అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ తాజాగా రిలీజ్ అయ్యింది.ఈ మూవీకి విశేషమైన స్పందన లభించింది.మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతుంది.

Telugu Ek Katha, Santosh Sobhan, Tollywood, Uv Concepts, Uv-Movie

ఈ మూవీ హిట్ తో హీరో సంతోష్ మరో మూడు అవకాశాలు కూడా సొంతం చేసుకున్నాడు.దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకి కథని అందించాడు.తన తండ్రి రాసిన నవలల్లో ఒక స్టోరీ లైన్ ఏక్ మినీ కథ కోసం మేర్లపాక ఉపయోగించుకున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మేర్లపాక గాంధీ యూవీ నిర్మాతల కాంబినేషన్లో మరో బోల్డ్ కంటెంట్ ఈ సినిమాని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.ఈ కాన్సెప్ట్ కూడా మేర్లపాక గాంధీ తన తండ్రి నవలల నుంచి తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడుని యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో పరిచయం చేయబోతున్నట్లు టాక్ వస్తుంది.ఇలా బోల్డ్ కంటెంట్ కాన్సెప్టులను వరుసగా తక్కువ బడ్జెట్ తో యువి నిర్మాతలు ప్రేక్షకులకి అందించడానికి రెడీ అవుతున్నట్లు భోగట్టా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube