అట్టర్ ప్లాప్ ప్రాజెక్ట్ అంటూ..   షర్మిల ' ఢిల్లీ' దీక్ష ! 

తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్  తెలంగాణ పార్టీ(Telangana Party) స్థాపించిన షర్మిల గత కొంతకాలంగా ఏదో ఒక అంశంపై స్పందిస్తూనే తమ పార్టీని జనాలకు దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ముఖ్యంగా తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్(BRS) ను టార్గెట్ చేసుకుని ఆమె ముందుకు వెళ్తున్నారు.

 Utter Plop Project Sharmila's 'delhi' Deeksha, Sharmila, Ysrtp, Kcr, Telangana,-TeluguStop.com

తాజాగా మరో దీక్షకు షర్మిల(Sharmila) దిగుతున్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు ధర్నాకు దిగుతున్నారు.

ధర్మ స్థలం నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేయాలని షర్మిల నిర్ణయించారు.కాలేశ్వరం ప్రాజెక్టును కమీషన్ ల కోసమే నిర్మించారని, అవసరంలేని బ్యారేజ్ లు,  పంపు హౌస్ లు , సైడ్ కెనల్స్,  బాహుబలి మోటార్స్ పెట్టారని విమర్శించారు.కాలేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టారని,  అయినా అది అట్టర్ ప్లాప్ అయ్యిందని షర్మిల విమర్శించారు.ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం ఏ సంవత్సరం కూడా అర్థ టీఎంసీ నీళ్లు తీసుకోలేదని అన్నారు.

ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ఒక సంవత్సరం 50,000 ఎకరాలకు , ఒక సంవత్సరం 57 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాయని చెబుతున్నాయన్నారు.

ప్రాజెక్టు ఖర్చు మూడింతలు పెంచారని , మెగా కృష్ణారెడ్డి(Krishna Reddy) అనే కాంట్రాక్టర్ తో సంబంధాలు ఉన్నాయి కాబట్టే,  కమిషన్ కోసం రీ డిజైనింగ్ చేశారని షర్మిల ఆరోపణలు చేస్తున్నారు.కాలేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని రకాల ఆరోపణలు వస్తున్న,  కేంద్రంలో అధికారులు బిజెపి ఎందుకు దీనిపై విచారణ చేయడం లేదని షర్మిల ప్రశ్నిస్తున్నారు.మేము మాత్రమే ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా చేసే అక్రమాలను ప్రశ్నిస్తున్నామని అన్నారు.

ఎంపీలంతా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కలిసి రావాలని షర్మిల కోరుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube