భావోద్వేగానికి గురైన ఉత్తేజ్.. నరేశ్‌ ప్రవర్తనపై ఆవేదన.. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్ గతంలో ఎన్నడూ జరగని రీతిలో చాలా రసవత్తరంగా సాగాయి.ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పోలింగ్ కూడా జరిగింది.

 Uttej Felt Emotional About Naresh And Maa-TeluguStop.com

సినీ ప్రముఖులు చాలా మంది వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఇకపోతే ఫైనల్ గా మంచు విష్ణు మా ప్రెసిడెంట్‌గా సెలెక్ట్ అయ్యారు.

అయితే, మా సంక్షేమం కోసం తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది తెలిపారు.ఈ క్రమంలోనే వారు మీడియాతో మాట్లాడారు.

 Uttej Felt Emotional About Naresh And Maa-భావోద్వేగానికి గురైన ఉత్తేజ్.. నరేశ్‌ ప్రవర్తనపై ఆవేదన.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నటుడు ఉత్తేజ్ ఈ క్రమంలో సీనియర్ హీరో, మా మాజీ అధ్యక్షుడు నరేశ్ ప్రవర్తన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్తేజ్ మాట్లాడుతూ సినిమా అనే వర్డ్ లోకల్ కాదని, అటువంటి నేపథ్యంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాలు తెరమీదకు తీసుకొచ్చారని చెప్పారు.

ఎక్కడో పుట్టినప్పటికీ తెలుగు ఆర్టిస్టుల కోసం ఏదైనా చేయాలని ప్రకాశ్ రాజ్ అధ్యక్షుడిగా పోటీ చేశారన్నారు.ఇకపోతే నరేశ్ ప్రవర్తనపై మండిపడ్డారు.ఎలక్షన్స్ రోజున నరేశ్ తనను తీవ్రమైన పదజాలంతో దూషించడాని, సంగతి చూస్తానని హెచ్చరించాడని చెప్పాడు.సీసీసీ ద్వారా ఎన్నో సేవలు చేసిన పెద్దమనిషిని తప్పుబట్టారన్నారు.

Telugu Emotional About Naresh, Maa Elections, Manchu Vishnu, Naresh, Prakash Raj, Prakash Raj Pannel, Tollywood, Uttaj, Uttej-Latest News - Telugu

తాను, బెనర్జీ పట్ల ఇలా వ్యవహరించిన నరేశ్ మిగతా వారి పట్ల ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.తన భార్య చనిపోతే ఇండస్ట్రీ మొత్తం వచ్చి ఓదార్చిందని, అలాంటిది ఆయన అధ్యక్షుడిగా ఉన్న మా‌లో ఈసీ మెంబర్ అయిన తనకు నరేశ్ కనీసం ఒక్క ఫోన్ కాల్ చేయలేదని చెప్పారు.తనను పరామర్శించడానికి రానీ నరేశ్ ‘మా సభ్యులకు ఏ విధంగా మేలు చేశాడని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే తనకు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులందరికీ మా ప్రెసిడెంట్ మంచు విష్ణుపై నమ్మకం ఉందని, మా కోసం ఆయన మంచి చేయగలడని నమ్ముతున్నామని చెప్తూ భావోద్వేగానికి గురయ్యాడు ఉత్తేజ్.

సిని‘మా’ బిడ్డలం ప్యానెల్ నుంచి గెలుపొందని పదకొండు మంది సభ్యుల రాజీనామాపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

#Naresh #Uttej #Prakash Raj #Naresh #MAA

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు