ఉత్తర ప్రదేశ్‌ సంచలన నిర్ణయం

మరో పది రోజుల్లో లాక్‌డౌన్‌ ముగియబోతుందని అంతా అనుకుంటున్న సమయంలో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్‌ మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది అన్నట్లుగా సంకేతాలు ఇస్తోంది.లాక్‌డౌన్‌ పూర్తి అయిన తర్వాత ఎవరి పనులు వారు చేసుకోవాలని భావిస్తున్న వలస కార్మికులను వారి వారి ప్రాంతాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా యూపీ సీఎం యోగి ఆధిత్యనాద్‌ ప్రకటించారు.

 Uttarpradesh Cm Yogi Adityanath Take The Key Decission About Immigrations , Utta-TeluguStop.com

అతి త్వరలోనే ప్రతి ఒక్కరిని కూడా వారి వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో పరిస్థితులు అస్సలు అదుపులోకి రాని ఈ సమయంలో వలస కార్మికులను చాలా కాలం పాటు పోషించడం కష్టంగా భావించిన ప్రభుత్వం వారి వారి సొంత ప్రాంతాలకు తరలించాలనే సీఎం నిర్ణయించినట్లుగా సమాచారం అందుతోంది.

అలాగే ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న కార్మికులకు స్క్రీనింగ్‌ చేసి రాష్ట్రంలోకి రానివ్వాలని అధికారులకు యోగి ఆధిత్యనాద్‌ పేర్కొన్నారు.ఆయన తీసుకున్న నిర్ణయంతో లాక్‌డౌన్‌ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube