వైరల్‌ : డెత్‌ సర్టిఫికెట్‌ ఇలా కూడా రాస్తారా సారూ

మనిషి చనిపోయిన సమయంలో డెత్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి.అలా డెత్‌ సర్టిఫికెట్‌ను తీసుకుంటేనే చనిపోయిన వ్యక్తి పేరుమీద ఉన్న ఇన్సురెన్స్‌ లేదా ఇతరత్ర పథకాలకు కుటుంబ సభ్యులు అర్హులు అవుతారు.

 Uttarpradesh Village Officer Wishes Bright Future For Death Person-TeluguStop.com

ఆ డెత్‌ సర్టిఫికెట్‌ను మున్సిపాల్లీ పరిధిలో అయితే మున్సిపల్‌ కమీషనర్‌ జారీ చేస్తారు.అదే గ్రామ పరిదిలో అయితే పంచాయితీ సెక్రటరీ జారీ చేస్తాడు.

డెత్‌ సర్టిఫికెట్‌ను మామూలుగా అయితే ప్రింటెడ్‌ ఇవ్వాలి.కాని ఉత్తర భారతదేశంలోని పలు గ్రామాల్లో ఇంకా కూడా కంప్యూటర్‌ అంటేనే తెలియదు.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా సిర్‌వారియా అనే గ్రామంలో లక్ష్మీ శంకర్‌ అనే వృద్దుడు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు.ఆయన మృతితో కుటుంబ సభ్యులకు ఇన్సురెన్స్‌ వచ్చేవి ఉన్నాయి.

దాంతో లక్ష్మీ శంకర్‌ తనయుడు తన తండ్రి డెత్‌ సర్టిఫికెట్‌ కోసం సిర్‌వారియా గ్రామ కార్యదర్శికి దరకాస్తు పెట్టుకున్నాడు.

Telugu Certificate, Lakshmi Shankar, Uttarpradesh-Latest News - Telugu

దరకాస్తు పెట్టుకున్న ఆ కొడుకుకు సిర్‌వారియా కార్యదర్శి సర్టిఫికెట్‌ను జారీ చేయడం జరిగింది.అయితే ఆ సర్టిఫికెట్‌లో ఆ కార్యదర్శి ఎంత శ్రద్ద పెట్టి డ్యూటీ చేస్తున్నాడో అర్థం అయ్యింది.

Telugu Certificate, Lakshmi Shankar, Uttarpradesh-Latest News - Telugu

డెత్‌ సర్టిఫికెట్‌లో లక్ష్మీ శంకర్‌ ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనే వివరాలను రాసిన కార్యదర్శి చివర్లో శంకర్‌ గారు మీరు భవిష్యత్తులో వెలిగి పోవాలి, మీకు అన్ని లాభాలు చేకూరాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటూ రాశాడు.చనిపోయిన వ్యక్తి ఇలా ఎలా ఉంటాడు.అసలు చనిపోయిన వ్యక్తికి భవిష్యత్తు ఎక్కడిది అంటున్నారు.

కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ డెత్‌ సర్టిఫికెట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube