వావ్‌.. స్ట్రీట్ బిజినెస్‌తోనే కోట్లు సంపాదించార‌ట‌...!

పట్టుదల ఉంటే తప్పకుండా ఎంతటి కలనైనా ఎవరైనా సాకారం చేసుకోవచ్చని పెద్దలు, నిపుణులు చెప్తుంటారు.పేద, ధనిక అనేది మన ఆలోచనల్లో ఉండకూడదని గొప్ప కలలు కంటే వాటి సాకారానికి కష్టం, పట్టుదల తోడైతే చాలు.

 Uttarpradesh Street Vendors Earned Crores Of Rupees, Street Business, Earning Cr-TeluguStop.com

ఆటోమేటిక్‌గా సక్సెస్ మన ముంగిట ఉంటుంది.అయితే, ప్రతీ ఒక్కరు ఏదో ఒక రోజు ఒక అడుగుతోనే తమ ప్రయాణాన్ని సాగించినట్లు మొదలు మనం వేసే అడుగు చిన్నదైనా పర్లేదు.

కానీ, ధైర్యంగా వేయాలి.అలా చేస్తే రూ.కోట్లు మన చెంతన వస్తాయని చెప్పేందుకు ఈ వీధి వ్యాపారులే ఉదాహరణ.అదేంటీ? వీధి వ్యాపారులు కోట్ల రూపాయలు సంపాదించడం ఏంటి? అనుకుంటున్నారా? అవునండీ మరు చదివింది.నిజమే స్ట్రీట్ వెండార్స్ తమ బిజినెస్‌తో కోట్లు గడించారు.ఎక్కడంటే.

ఉత్తరప్రదేశ్‌లోని వీధి వ్యాపారులు రోడ్డు పక్కన చిన్న షాపుల్లో తమ వ్యాపారాన్ని ప్రారంభించారు.సమోసా, టిఫిన్స్ ఇతరాలు అమ్ముకుంటూ బిజినెస్ చేస్తున్నారు.

అయితే, వ్యాపారంలో లాభాలు బాగానే గడించినప్పటికీ మా వద్ద ఏం లేదంటూ వీధి వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులను ఎగవేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలో వీరి నుంచి ఎలాగైనా పన్నువసూలు చేయాలని భావించిన ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు వారిపై దాడులు చేశారు.256 మంది చిరు వ్యాపారుల ఇళ్లపై దాడులు చేశారు.వారి ఇండ్ల వద్ద ఉన్న వందల కోట్ల ఆస్తుల డాక్యుమెంట్లు చూసి వారి కళ్లు బైర్లు గమ్మాయి.

Telugu Rupees, Tax Officers, Paid Tax, Raid, Street-Latest News - Telugu

వారంతా జీఎస్టీ కట్టకుండా వందల కోట్ల రూపాయలు దాచిపెట్టుకున్నట్లు గుర్తించారు.ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం.ఈ చిరు వ్యాపారుల వద్ద రూ.375 కోట్ల ఆస్తులు ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు.కాగా, ఇంకా దాడులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.ఇక వారి నుంచి పన్నులు వసూలు చేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోనున్నారు.స్ట్రీట్ బిజినెస్‌తోనే రూ.కోట్లు సంపాదించారంటే మంచి విషయమే.కానీ, ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టడం సరి కాదని పలువురు పేర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube