విడ్డూరం: టాయిలెట్‌ ను గుడి అనుకుని నెలల తరబడి పూజలు చేశారు, చివరకు ఎలా తెలిసిందంటే!  

uttarapradesh moudaha villagers praying totoilet they think temple - Telugu Moudaha Villagers Praying To Toilet, Praying To Toilet, Telugu Viral News Updates, Toilet, Uttarapradesh Moudaha Villagers, Viral In Social Media

ప్రేమలో ఉన్నప్పుడు కళ్లు కనిపించవు అంటారు.అలాగే భక్తిలో ఉన్నప్పుడు కూడా కళ్లు మూసుకు పోతాయంటూ మరోసారి నిరూపితం అయ్యింది.

TeluguStop.com - Uttarapradesh Moudaha Villagers Praying Totoilet They Think Temple

దేవుడిపై భక్తి ఉండాలి కాని అది శృతి మించితే ఇలాగే జరుగుతుందని మళ్లీ నిరూపితం అయ్యింది.ఒక టాయిలెట్‌ను దేవాలయంగా భావించి కొన్ని నెలలుగా అక్కడ పూజలు చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా వివాదాస్పదం అయిన ఈ విషయం పూర్తి వివరాలు చెప్పిన తర్వాత మీరు నవ్వుకోవడంతో పాటు వారిపై కోపం కూడా ప్రదర్శిస్తారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ జిల్లా మౌదాహా గ్రామంకు చెందిన ప్రజలు గత కొన్ని రోజులుగా ఒక మూసి ఉన్న చిన్న భవనం ముందు పూజలు చేస్తున్నారు.

ఆ భవనంకు కాషాయం రుంగు వేయడంతో పాటు, దానిపై కాషాయం జెండా ఎగురుతూ ఉంది.కనుక అది ఒక గుడి అనుకున్నారు.ఆ చిన్న భవనం డోర్లు వేసి ఉండటం వల్ల అందులో దేవుడు ఉండి ఉంటాడు అనుకున్నారు.లోపల ఏ దేవుడు ఉన్నాడో అనే విషయం పట్టించుకోకుండానే పూజలు చేయడం మొదలు పెట్టారు.

గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడ పూజలు చేస్తూ వచ్చారు.

చాలా నెలల తర్వాత అది ఒక గుడి కాదని టాయిలెట్స్‌ అంటూ తెలిసింది.నిర్మాణం జరిగి చాలా కాలం అయినా కూడా కొన్ని కారణాల వల్ల ఓపెన్‌ చేయలేదంటూ అధికారులు చెప్పారు.గ్రామ శివారులో ఒక కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం చేశారు.

ఆ హాల్‌కు అనుసంధానంగా టాయిలెట్‌ను నిర్మించారు.అయితే అది టాయిలెట్‌ అనే విషయం ఎవరు గ్రహించలేక పోయారు.

కారణం ఆ టాయిలెట్స్‌కు వేసిన రంగు కూడా ఒకటి.జనాలు గుడ్డిగా మరీ ఇలా ప్రవర్తించడంపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కామెడీ మీమ్స్‌ వస్తున్నాయి.

#ViralIn #TeluguViral #Toilet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు