ఆ మంత్రుల్లో టెన్షన్ ? ఇద్దరిపై వేటు పడనుందా ?  

Uttarandhra Ycp Ministers Tension - Telugu Bc, Ministers, Srikakulam Minister, Two Ministers Tension Over Post, Uttarandhra Districts, Ycp, Ys Jagan

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మంత్రి పదవుల నియామక సందడి ఒకవైపు, తొలగింపుల అంశం మరో వైపు టెన్షన్ పెడుతున్నాయి.ప్రస్తుత మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మరికొద్ది రోజుల్లో తమ పదవులకు రాజీనామా చేయబోతున్న నేపద్యంలో జగన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నట్లు కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

 Uttarandhra Ycp Ministers Tension

దీంతోపాటు కొంత మంది మంత్రుల పనితీరు పై జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే వారిపై వేటు పడుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇద్దరు మంత్రుల పనితీరు పై జగన్ చాలా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే మంత్రుల పనితీరు పై ఏడాది నివేదిక తెప్పించుకున్న జగన్ అందులో పనితీరు బాగోలేని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు మంత్రులు పై వేటు వేయాలని చూస్తున్నారట.ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నలుగురు మంత్రులుగా ఉన్నారు.

ఆ మంత్రుల్లో టెన్షన్ ఇద్దరిపై వేటు పడనుందా -Political-Telugu Tollywood Photo Image

వీళ్ళ పై వేటు పడిపోయే ఇద్దరు ఎవరు అనే టెన్షన్ పార్టీల్లో నెలకొంది.ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీనియర్ రాజకీయ నేత మంత్రిగా ఉన్నారు.

ఆయన పనితీరుపై జగన్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.కొద్దిరోజులుగా ఆయనను జగన్ పెద్దగా పట్టించుకోన్నట్టు గా వ్యవహరిస్తుండడంతో, ఆయనపై వేటు తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.

అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మంత్రి ని తప్పించి, ఆయన స్థానంలో ఆయన సోదరుడిని నియమిస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.కాకపోతే జగన్ ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తారు ? ఎవరు ఎవరిని తొలగిస్తారనే వివరాలు బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.కాకపోతే ప్రస్తుతం ఖాళీ కాబోతున్న రెండు మంత్రి పదవులతో పాటు మరో రెండు పదవుల్లో మంత్రులుగా కొనసాగుతున్న ఇద్దరిని తప్పించి మొత్తం కొత్తగా నలుగురు తీసుకునే అవకాశం ఉండటంతో, ఖచ్చితంగా 2 బీసీ సామాజిక వర్గానికి, మరో రెండు జగన్ కు అత్యంత సన్నిహితులైన వారికి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test