మంత్రిగారి భార్యకు కరోనా, మంత్రి తో సహా 40 మంది…  

Uttarakhand Minister Wife Covid - Telugu Amrita Rawat, Ashish Srivastava, Celebrity, Corona Virus, Home Quarantine, Ministers, Satpal Maharaj, Uttarakhand

కరోనా తో పేదప్రజల కంటే కూడా మంత్రులు,సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన ఎక్కువ పడుతున్న విషయం తెలిసిందే.తాజాగా ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ భార్య,మాజీ మంత్రి అమృత రావత్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.

 Uttarakhand Minister Wife Covid

ఇటీవల అస్వస్థతకు గురైన అమృత రావత్ నమూనాలను సేకరించిన వైద్యులు డెహ్రాడూన్ లోని ఒక ప్రయివేట్ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించారు.అయితే, ఆ నివేదికలో ఆమె కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు.

అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు.ఇక, మంత్రి భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో మంత్రి సత్పాల్ మహారాజ్‌తో పాటు నలభై మందిని హోం క్వారంటైన్‌లో పెట్టారు.

మంత్రిగారి భార్యకు కరోనా, మంత్రి తో సహా 40 మంది…-General-Telugu-Telugu Tollywood Photo Image

మరోవైపు.తన భార్యకు కోవిడ్ 19 పాజిటివ్‌గా ధృవీకరించారు మంత్రి.

నా భార్యకు గత మూడు, నాలుగు రోజులుగా జ్వరం వచ్చింది.మొదట, ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు నిర్వహించాం.

నెగిటివ్‌గా వచ్చింది.అయితే మళ్లీ శనివారం కోవిడ్ -19 పరీక్షలు చేయించడంతో పాజిటివ్‌గా వచ్చిందన్నారు.

తన కుటుంబం, భార్యతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్య శాఖ ప్రోటోకాల్‌ను అనుసరించి నిర్బంధంలోకి వెళతారని మంత్రి తెలిపారు.చికిత్స కోసం తన భార్యను ఆసుపత్రిలో చేర్చినట్టు వెల్లడించారు.

ఇక, ఉత్తరాఖండ్‌లో మరో 22 మంది శనివారం కరోనావైరస్ పాజిటివ్‌గా వచ్చింది.దీంతో.ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 749 కి చేరుకుంది.కొత్తగా నమోదైన 22 కేసుల్లో.14 డెహ్రాడూన్, 3 హరిద్వార్, 5 నైనిటాల్‌లో నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.మరోవైపు ఈ కరోనా మహమ్మారి కి భారత్ అల్లాడుతోంది.

గడచిన 24 గంటల్లో 8 వేలకు పైగా కేసులు నమోదు అవ్వడం మరింత ఆందోళన కలిగిస్తుంది.నిపుణులు హెచ్చరించినట్లు జూన్,జులై నెలల్లో కరోనా భారత్ లో విలయతాండవం చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uttarakhand Minister Wife Covid Related Telugu News,Photos/Pics,Images..

footer-test