కుంభమేళా పై ఆ రాష్ట్ర సీఎం కీలక వ్యాఖ్యలు.. ?- Uttarakhand Cm Key Comments On Kumbh Mela

uttarakhand cm key comments on kumbh mela Uttarakhand, CM Tirath Singh Rawat, comments, Kumbh Mela - Telugu Cm Tirath Singh Rawat, Comments, Kumbh Mela, Uttarakhand

దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ వీటి వ్యాప్తిని పండగలు ఇంకా పెంచుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న కుంభమేళా విషయంలో చాలామంది భయాందోళనలు వెల్లడిస్తున్నారు.

 Uttarakhand Cm Key Comments On Kumbh Mela-TeluguStop.com

ఈ కుంభమేళా మరో మర్కజ్ ఘటనగా మారుతుందని ఆరోపిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్ సీఎం

తీరథ్ సింగ్ రావత్

కీలక వ్యాఖ్యలు చేశారు.ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న కుంభమేళాను, నిజాముద్దీన్ మర్కజ్‌తో పోల్చవద్దని తెలియచేస్తున్నారు.

కాగా గత సంవత్సరం మర్కజ్ జరిగిన సమయంలో కరోనా తొలిసారిగా విజృంభిస్తుండటం వల్ల దాని నివారణ చర్యలపై అవగాహన లేదని, కానీ ఇప్పుడు మాత్రం కోవిడ్ పట్ల పూర్తి అవగాహన వచ్చిందని అన్నారు.

 Uttarakhand Cm Key Comments On Kumbh Mela-కుంభమేళా పై ఆ రాష్ట్ర సీఎం కీలక వ్యాఖ్యలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే కాకుండా మర్కజ్ మూసి ఉన్న ఓ కట్టడం లోపల జరగడం వల్ల కరోనా వ్యాప్తి జరిగిందని, కానీ కుంభమేళా మాత్రం విస్తారమైన బహిరంగ ఘాట్‌లల్లో జరుగుతుందని, మర్కజ్‌కు విదేశీయులూ వస్తారని, కానీ, కుంభమేళాలో మన దేశీయులే పాల్గొంటారని వివరించారు.ఇకపోతే 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకార్యాన్ని అన్ని జాగ్రత్తలు పాటించి విజయవంతం చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.

#CMTirath #Uttarakhand #Comments #Kumbh Mela

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు