ఉత్త‌రాఖండ్‌లోని ఆ గ్రామాల‌కు చెందిన ప్ర‌జ‌లు చైనా నుంచి నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను కొంటున్నార‌ట‌..

దౌర్భాగ్యం అంటే అదే.మ‌న నేత‌ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల పేద ప్ర‌జ‌లు తిండి, నిత్యావ‌స‌ర వ‌స్తువుల కోసం ప‌క్క దేశాల మీద ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

 Uttarakhand 400 Families Forced To Buy Food From China Via Nepal-TeluguStop.com

ఉత్త‌రాఖండ్‌లోని బ్యాస్ లోయ‌లో ఉండే 7 గ్రామాల‌కు చెందిన 400 కుటుంబాలకు ప్ర‌భుత్వం ఇచ్చే రేష‌న్ స‌రుకులు స‌రిపోవ‌డం లేదు.దీంతోవారు మ‌న పొరుగుదేశ‌మైన చైనాపై ఆధార ప‌డుతున్నారు.

ఆ దేశం నుంచి వారు త‌మకు కావ‌ల్సిన ఉప్పు, వంట నూనె, బియ్యం, గోధుమ‌లు త‌దితర వ‌స్తువుల‌ను నేపాల్ మీదుగా తెప్పించుకుంటున్నారు.బుంది, గుంజి, కుటి, న‌ప‌ల్చు, నభి, గ‌ర్బ‌యంగ్‌, రాంకోంగ్ గ్రామాల‌కు చెందిన కుటుంబాలు త‌మ‌కు కావ‌ల్సిన స‌రుకుల కోసం పొరుగు దేశ‌మైన చైనాపై ఆధార ప‌డుతున్నాయి.

టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతున్న నివేదిక ప్ర‌కారం.స‌ద‌రు గ్రామ వాసుల‌కు చైనా నుంచి వ‌స్తువుల‌ను కొనుక్కోవ‌డం త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేద‌ని తెలిసింది.దీంతో వారు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి వ‌చ్చే చైనా నుంచి వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తున్నామ‌ని చెబుతున్నారు.మా సొంత దేశంలోనే మేము అనాథ‌ల్లా బ‌తుకుతున్నామ‌ని వారు తెలిపారు.దేశానికి చెందిన ముఖ్య‌మైన స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉంటున్నా త‌మ స‌మ‌స్య‌లు మాత్రం అలాగే ఉన్నాయ‌ని వారు వాపోతున్నారు.

ఆ గ్రామ వాసుల‌కు గ‌త కొద్ది నెల‌ల నుంచి రేష‌న్ స‌రుకులు అంద‌క‌పోవ‌డానికి కార‌ణం.

ఆ వ్యాలీకి స‌మీపంలో ఉన్న లిపులేఖ్ పాస్ అనే ప్రాంతం వ‌ద్ద రోడ్డు బ్లాక్ అయింది.దీంతో వాహ‌నాలేవీ రావ‌డానికి వీలు కావ‌డం లేద‌ని, అందువ‌ల్లే రేష‌న్ స‌రిగ్గా ల‌భించ‌డం లేద‌ని వారు చెబుతున్నారు.

ఇక ఆ వ్యాలీకి స‌మీపంలో ఉన్న 50 కిలోమీట‌ర్ల దూరంలోని దార్చులా అనే ప్రాంతంలోనూ నిత్యావ‌స‌ర వ‌స్తువులు ల‌భిస్తాయి.కాక‌పోతే ఆ మార్గంలో కూడా అన్ని అవ‌రోధాలే ఉంటాయి.

ఆ వ్యాలీలో నివాసం ఉంటున్న కుటుంబాల‌కు అక్కడి ప్ర‌భుత్వం ప్ర‌తి నెలా రెండు కిలోల బియ్యం, 5 కిలోల గోధుమ‌ల‌ను ఇస్తుంది.అయితే ఆ స‌రుకులు త‌మ‌కు స‌రిపోవ‌డం లేద‌ని ఆ గ్రామ‌వాసులు చెబుతున్నారు.దీంతో వారు నేపాల్ మీదుగా చైనాలోని ట‌క్ల‌కోట్ బ‌జార్ నుంచి స‌రుకుల‌ను కొని తెప్పించుకుంటున్నారు.అయితే నిజానికి త‌మ‌కు స్థానికంగా దొరికే స‌రుకుల క‌న్నా అక్క‌డి నుంచే త‌క్కువ ధ‌రకు అవి లభిస్తాయ‌ని వారు చెబుతున్నారు.

అయితే స్థానికంగా నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల సంఖ్య పెరుగుతుంద‌ని, అందుకే తగిన‌న్ని రేష‌న్ స‌రుకులు స‌ర‌ఫరా చేయ‌డం ప్ర‌భుత్వానికి క‌ష్టంగా మారింద‌ని స్థానిక అధికారులు చెబుతున్నారు.

కాగా ఈ విష‌యంపై పితోరాగ‌డ్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.

ప్ర‌జ‌ల‌కు స‌రిప‌డిన‌న్ని రేష‌న్ స‌రుకుల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు తాము త్వ‌ర‌లో హెలికాప్ట‌ర్ సేవ‌ల‌ను వినియోగిస్తామ‌ని అన్నారు.కాగా చాలా మంది అపాయంతో కూడిన దారుల్లో ప్ర‌యాణిస్తూ అన‌వ‌స‌రంగా ప్ర‌మాదాల‌ను కొని తెచ్చుకుంటున్నార‌ట‌.

ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం ప‌ట్టించుకుని త‌మ స‌మ‌స్య‌ను పరిష్క‌రించాల‌ని ఆ గ్రామ వాసులు కోరుతున్నారు.ఏది ఏమైనా.

ఇలాంటి నిర్ల‌క్ష్య‌పూరిత అధికారులు, నాయ‌కులు ఉన్నంత వ‌ర‌కు సామాన్య జ‌నాలు ఇలా క‌ష్టాలు ప‌డ‌క త‌ప్ప‌దు.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube