ఆ నాలుగు చెత్త గ్రామాలు, అక్కడి అబ్బాయిలకు పెళ్లిలే కావడం లేదు, కారణం ఇదే  

Uttara Pradesh Four Villages Boys Not Getting Marriages Because Of Dumping Yards-four Villages

కొన్నాళ్ల క్రితం ఉత్తప్రదేశ్‌లోని కొన్ని గ్రామాలకు ఆడపిల్లలను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పుకునే వారు కాదు.ఎందుకంటే అక్కడ తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని, నీటి కోసం తమ పిల్లలు కిలోమీటర్ల వరకు నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుందేమో అనే ఉద్దేశ్యంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఆ ఊరు అబ్బాయిలకు అస్సలు పిల్లనిచ్చేవారు కాదు.

Uttara Pradesh Four Villages Boys Not Getting Marriages Because Of Dumping Yards-four Villages-Uttara Pradesh Four Villages Boys Not Getting Marriages Because Of Dumping Yards-Four

అలా చాలా మంది అబ్బాయిలు ముదురు బెండకాయలు అయ్యారు.ప్రస్తుతం నీటి సమస్యకు చాలా చోట్ల చెక్‌ పెట్టారు.పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకుని మినరల్‌ వాటర్‌ వచ్చేశాయి.దాంతో పెళ్లి కాని ప్రసాద్‌ల సంఖ్య తగ్గింది.ఇప్పుడు మరో సమస్య ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు గ్రామాల యువకులను వేదిస్తుంది.

Uttara Pradesh Four Villages Boys Not Getting Marriages Because Of Dumping Yards-four Villages-Uttara Pradesh Four Villages Boys Not Getting Marriages Because Of Dumping Yards-Four

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలోని నాలుగు గ్రామాల్లో ఉన్న యువకులకు పెళ్లిలు కావడం లేదు.చదువుకుని వేరే ప్రాంతాల్లో ఉంటే వారికి పెళ్లిలు అవుతున్నాయి కాని అక్కడే ఉండి ఏదైనా పని చేసుకునే వాళ్లకు మాత్రం పెళ్లిలు అవ్వడం లేదు.

దీనికి కారణం అత్యంత విచిత్రంగా ఉంది.ఈ కారణం చెప్తే మీరు ఆశ్చర్య పోతారేమో.ఆ నాలుగు గ్రామాలకు చెందిన యువకులు పెళ్లిలకు దూరం అవ్వడానికి ప్రధాన కారణం డంప్పింగ్‌ యార్డ్‌లు.ఔను డంపింగ్‌ యార్డ్‌ల కారణంగా ఆ నాలుగు గ్రామాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

కాన్పూర్‌కు చెందిన చెత్త అంతా కూడా ఆ నాలుగు ఊర్ల శివారుల్లో పోస్తున్నారు.దాంతో ఆ నాలుగు ఊర్లు కూడా చెత్త మయం అయ్యాయి.అత్యంత దుర్ఘందంతో కూడిన వాసనతో ఆ గ్రామాలు ఎప్పుడు కూడా ఉంటాయి.ఆ కారణం వల్ల గ్రామంలోని ప్రజలు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యను కలిగి ఉంటాయి.చెత్త వాసన మరియు క్రిములు ఇతరత్ర కారణాల వల్ల వారి ఆయుశ్శు కూడా చాలా తగ్గిందని స్థానిక డాక్టర్లు అంటున్నారు.

నాలుగు గ్రామాల్లో చెత్త వేస్తున్న అధికారులు వారికి వస్తున్న సమస్యల గురించి పట్టించుకోవడం లేదు.యువకులు స్థానికంగా ఉంటూ పని చేసుకుంటున్నారంటే వారికి పెళ్లి అవ్వడం సాధ్యం అయ్యే విషయం కాదు.ఎన్ని సార్లు అధికారులతో మొర పెట్టుకున్నా కూడా డంప్పింగ్‌ యార్డ్‌లను తొలగించేందుకు మాత్రం వారు ఒప్పుకోవడం లేదు.

ఆ డంప్పింగ్‌ యార్డ్‌లు ఉన్నన్ని రోజులు ఆ గ్రామాల యువకులకు పెళ్లిళు కావు.మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైనా మార్గం వారికి చూపించాలని మనము కోరుకుందాం.