ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏ విషయం గురించి డెసిషన్ తీసుకున్నా అది చర్చనీయాంశమవుతుంది.కిమ్ అంటే చాలా దేశాలకు భయం ఉంది.
ఆయన ఏం ఎప్పుడు చెబుతారోనని గుబులు కూడా ఉంది.అటువంటి కిమ్ గురించి కథనాలు వస్తూ ఉంటాయి.
కొన్ని రోజులుగా కిమ్ ఏ కార్యక్రమానికి హాజరు కాలేదు.ఒక కార్యక్రమానికి ఆయన చెల్లెలు హాజరై కొన్ని రోజులు పాలన సాగించింది.
అయితే ఆ టైమ్ లో కిమ్ చనిపోయాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే ఆ తర్వాత కిమ్ ఆ కథనాలకు స్వస్థిపలికారు.
ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని అందరికీ తాను బతికే ఉన్నానంటూ సమాధానమిచ్చారు.
ప్రస్తుతం కిమ్ ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
ఆ ఫోటోలు గమనించిన ప్రజలు వివిధ కామెంట్లు, డౌట్లను తెలుపుతున్నారు.కిమ్ చాలా వరకూ తగ్గిపోయాడని, కిమ్ రూపాన్ని చూస్తే ఆ విషయం అందరికీ అర్థం అవుతుందని అందరూ భావిస్తున్నారు.

దక్షిణ కొరియా సీక్రెట్ ఏజెన్సీ ద్వారా కిమ్ కార్యక్రమానికి హాజరైన ఫోటోలు బయటపడ్డాయి.ఆ ఫోటోలల్లో కిమ్ బొద్దుగా ఉండకుండా సన్నబడినట్లుగా తెలుస్తోంది.ముఖం, మెడ, చేతులు, ఛాతి భాగం మొత్తం సన్నగా అయిపోయి చాలా మార్పులు వచ్చినట్లుగా గుర్తించారు.కిమ్ ఎడమ మణికట్టు ఇంతకు ముందు కంటే చాలా సన్నగా మారిపోయిందని, అందుకు ఆయన వేసుకున్నా వాచ్ ను చూస్తే సరిపోతుందని నిపుణులు భావిస్తున్నారు.
కిమ్ వాచ్ దాదాపు 12 వేల డాలర్లు ఉండవచ్చు.

2020 నవంబర్ లో ఓ సమావేశానికి కిమ్ ఈ వాచ్ నే వేసుకుని వచ్చాడు.ఆ టైంలో ఆ వాచ్ చాలా బిగుతుగా ఉండేది.అయితే ఈయన ఇప్పుడు కావాలనే సన్నబడ్డారా లేక అనారోగ్యం వల్లే ఇలా జరిగి ఉంటుందా అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.
ప్రస్తుతం ఆయన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
