ఇంగ్లీష్ లో మాట్లాడి షాకిచ్చిన యాచకురాలు.. ఆమె గతం తెలిస్తే!

నిరుపేదల కంటే దిగువ రేఖన ఉండి ఏ ఆధారం లేక బిక్షాటన చేయడం ప్రారంభిస్తున్నారు చాలామంది.అనాధలు, వృద్ధులు భారతదేశంలో యాచించడమే వృత్తిగా జీవనం కొనసాగిస్తున్నారు.

 Uttarpradesh Waranasi Beggar Swathi Speaking English Fluently Details,   Women,-TeluguStop.com

అన్ని విధాల వెనుకబడిన వారు చదువులో కూడా అందరి కంటే వెనుకబడే ఉంటారు.వారి మాతృభాషను కూడా వారు చదవలేరు.

అయితే యాచుకులలో ఇలాంటి వారే ఉంటారనుకుంటే పొరపాటే.ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉన్నత చదువులు చదువుకున్న కొందరు బిచ్చగాళ్లు తారసపడుతూ అందరికీ షాక్ ఇస్తున్నారు.

అంత చదువుకుని వీళ్లేందుకు అలా మారారో తెలుసుకుని చాలామంది బాధపడుతుంటారు.ఇప్పుడు మనం చెప్పుకోబోయే యాచుకురాలు ఈ కోవకు చెందిందే.

యాచకురాలు ఇంగ్లీష్‌లో ఫ్లూయంట్ గా మాట్లాడుతూ స్థానికులను షాక్‌కు గురిచేసింది.ఆమె గురించి తెలుసుకున్న వారంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఆమె ఎవరు? ఇంగ్లీష్ మాట్లాడేంత టాలెంట్ ఉండి కూడా ఎందుకు యాచిస్తోంది? వంటి వివరాలు తెలుసుకుంటే.యూపీలోని వారణాసిలో స్వాతి అనే మహిళ యాచకురాలుగా తన జీవనాన్ని సాగిస్తోంది.

అయితే ఈమె ఇంగ్లీష్‌లో అవలీలగా మాట్లాడగలదు.దక్షిణ భారతదేశానికి చెందిన స్వాతి సామాన్యుల లాగానే జీవించేది.

బీఎస్సీ కంప్యూటర్ చేసిన ఆమె పెళ్లి కూడా చేసుకుంది.ఒక పండంటి బాబుకి జన్మనిచ్చింది.

విధి వక్రించి తన డెలివరీ సమయంలో ఆమె కుడి కాలు, కుడి చేతికి పెరాలసిస్ వచ్చింది.

దాంతో ఆమె నడవలేక చాలా ఇబ్బంది పడి పోయింది.అలాంటి పరిస్థితులలో అండగా ఉండాల్సిన కుటుంబ సభ్యులే ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు.దాంతో పుట్టెడు దుఃఖంతో ఆమె ఇంటి బయట అడుగు పెట్టింది.

ఏ పని చేయలేని ఆమె ఎక్కడికి వెళ్లాలో తెలియక చివరకు వారణాసికి తరలి వెళ్లింది.ఆమె అక్కడే గత మూడేళ్ల నుంచి భిక్షాటన చేస్తూ తన శేష జీవితాన్ని వెళ్లదీస్తోంది.

ఈ నేపథ్యంలోనే స్థానికులు ఆమె ఇంగ్లీష్ టాలెంట్ చూసి ఫిదా అయ్యారు.ఒక వ్యక్తి ఆమె గురించి మిగతా ప్రపంచానికి కూడా తెలియాలని ఒక వీడియో రికార్డు చేశాడు.ఆ వీడియోలో ఆమె తన నేపథ్యం గురించి చెప్పడం చూడొచ్చు.అయితే వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఆమెకు జాబ్ కూడా ఇస్తానని హామీ ఇవ్వడం చూడొచ్చు.

ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు షాక్ అవుతున్నారు.అయ్యో పాపం ఎంత దీన పరిస్థితి వచ్చిందమ్మా నీకు అంటూ సానుభూతి చూపుతున్నారు.ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మీరు కూడా దీనిపై ఓ లుక్కేయండి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube