ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ కు తెరలేపిన రాష్ట్ర ప్రభుత్వం …!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.ఈ తరుణంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ అవుతున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

నేటి రాత్రి 10 గంటల నుంచి 13 వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేశారు.

ఇక అత్యవసర సేవలను మినహాయించి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు అన్నీ కూడా మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇది ఇలా ఉండగా మరోవైపు రైలు, విమాన సర్వీసులు మాత్రం ఎప్పటిలాగానే కొనసాగుతాయని తెలియజేశారు.

అలాగే రహదారి నిర్మాణాలు, గ్రామీణ ప్రాంతాలలో కర్మాగారాలు కూడా అనుమతిస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది.

ఇక ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 30 వేలకు పైగా నమోదయ్యాయి.

వీరిలో 20 వేల మందికి పైగా కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వ అధికారులు తెలియజేశారు.

ఇక దేశ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ కూడా ఒకటి కావడం గమనార్హం.

ఇక ఈ తనంలోనే కరోనా టెస్టుల సామర్థ్యాన్ని మరింత పెంచాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షా కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఉత్తర ప్రదేశ్ లో కరోనా టెస్ట్ లు తక్కువగా జరుగుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి అన్నారు.

ఎన్ఆర్ఐలకు టీడీపీ సీట్లను అమ్ముకున్నారు..: కొడాలి నాని