ప్రియురాలు తన మాట వినడం లేదని ప్రియుడు ఏకంగా…  

17 year old minor girl brutally killed in Uttar Pradesh, Crime news, Uttar Pradesh, minor girl Raped, India, Hathras incident,  Bamber District, - Telugu 17 Year Old Minor Girl Brutally Killed In Uttar Pradesh, Bamber District, Crime News, Hathras Incident, India, Minor Girl Raped, Uttar Pradesh

దేశంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు, చట్టాలను తీసుకు వస్తున్నప్పటికీ మహిళలపై ఆగడాలు మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా ఓ యువకుడు తన ప్రియురాలు తన మాట వినడం లేదని ఏకంగా తన స్నేహితులతో కలిసి ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

TeluguStop.com - Uttar Pradesh Minor Girl Raped

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి బాంబర్ జిల్లా పరిసర ప్రాంతంలో 17 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువతి తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది. ఈ క్రమంలో యువతి స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో ప్రేమలో పడింది.

దీంతో అప్పుడప్పుడు ఇద్దరు ఇంట్లో అబద్ధాలు చెప్పి బయటకి వెళుతూ ఉండేవారు. కాగా తాజాగా యువకుడు తన ప్రియురాలిని కలవాలని కబురు పంపించినప్పటికీ ఆమె నిరాకరించడంతో యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు.

TeluguStop.com - ప్రియురాలు తన మాట వినడం లేదని ప్రియుడు ఏకంగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఈ క్రమంలో తన ప్రియురాలి పై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని పన్నాగం పన్నాడు.

ఇందులో భాగంగా యువకుడు తన ప్రియురాలికి మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి తమ పథకం లో భాగంగా తన స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశారు.

 అనంతరం ఏమీ ఎరగనట్లు యువతి మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి కాలువలో విసిరేసి వెళ్లిపోయారు.దీంతో ఇది గమనించిన స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించడంతో కాలువలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీసి శవానిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

దీంతో కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా తామే ఈ నేరం చేసినట్లు అంగీకరించారు.

#India #Uttar Pradesh #Bamber District #17Year

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uttar Pradesh Minor Girl Raped Related Telugu News,Photos/Pics,Images..