మరో మహిళపై మోజు పడి భార్యను చంపేందుకు ప్రయత్నించాడు.. ఏం జరిగిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు  

Uttar Pradesh Man Try To Kill Wife But-

ఈమద్య కాలంలో అత్యధికంగా కుటుంబ కేసులు అక్రమ సంబంధాల వల్ల నమోదు అవుతున్నట్లుగా పోలీసు వారు అంటున్నారు.ఇండియాలో అక్రమ సంబంధాల కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.అక్రమ సంబంధం పెట్టుకుని ఆమద్య ఒక భార్య తన భర్తను చంపించిన విషయం తెల్సిందే...

Uttar Pradesh Man Try To Kill Wife But--Uttar Pradesh Man Try To Kill Wife But-

అలా మీడియా ముందుకు రానివి చాలానే ఉన్నాయి.ప్రియుడి మోజులో పడ్డ యువతి భర్తను చంపడంతో పాటు, ప్రియురాలి మోజులో పడ్డ మగాడు భార్యలను కూడా చంపడం చాలా కామన్‌ అయ్యింది.

తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.

Uttar Pradesh Man Try To Kill Wife But--Uttar Pradesh Man Try To Kill Wife But-

గులామ్‌ సింగ్‌ అనే వ్యక్తి తన భార్యను కాదని మరో మహిళ మోజులో పడ్డాడు.ఆమెకు పెళ్లి అయ్యి విడాకులు అయిన నేపథ్యంలో గులామ్‌ సింగ్‌తో అక్రమ సంబంధం నెరుపుతూ వస్తున్నాడు.అయితే అనుమానం రాకుండా ఉండాలని ఆమె అతడిని ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి రానిచ్చేది కాదు.

చాలా అరుదుగా మాత్రమే, తాను చెప్పినప్పుడు మాత్రమే రావాలని కండీషన్‌ పెట్టిందట.గులామ్‌ భార్యకు అనుమానం రాకుండా ఉండాలని ఆమె ప్రయత్నాలు చేసింది.అయితే తన భార్యకు భయపడి తన ప్రియురాలు తనను దగ్గరకు రానివ్వడం లేదని భావించిన గులామ్‌ భార్యను చంపేయాలని భావించాడు.

భార్య చనిపోతే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని గులామ్‌ ఒక నిర్ణయానికి వచ్చాడు.అలా ఒక రోజు రాత్రి భార్యను చంపేందుకు ప్లాన్‌ చేశాడు.ధైర్యం చాలక పోవడంతో పెగ్‌ మీద పెగ్‌ అనుకుంటూ చాలానే లాగించాడు.తాగిన మత్తులో భార్యను చంపేందుకు సిద్దం అయ్యాడు.

అర్థరాత్రి తర్వాత ఇంటి వెనుక నుండి లోనికి వెళ్లిన అతడు భార్య పడుకునే బెడ్‌ వద్దకు వెళ్లాడు.రోకలి బండ తీసుకుని గట్టిగా మోదాడు.తాగిన మత్తులో ఉన్న అతడికి ఏం అర్థం కావడం లేదు...

ఇష్టం వచ్చినట్లుగా కొట్టి అక్కడ నుండి వెళ్లి పోయాడు.చీకటిగా ఉన్న కారణంగా అతడికి ఏమీ కనిపించలేదు.

బయటకు వెళ్లి భార్యను ఎవరో కొట్టి చంపేశారంటూ బో దిబో మన్నాడు.దాంతో చుట్టు పక్కల వారు వచ్చారు.

వారికి విషయం చెప్పి తన భార్య చనిపోయిందని లోనికి తీసుకు వెళ్లాడు.అదే సమయంలో గులామ్‌ సింగ్‌ భార్య బాత్‌ రూం నుండి బయటకు వచ్చింది.జనాలందరిని చూసి ఏమైందని ఆందోళన పడినది...

అందరికి విషయం అర్థం అయ్యి నలుగురు నాలుగు మాటలు అనేసి అక్కడి నుండి వెళ్లి పోయారు.భార్యను చంపేందుకు ప్రయత్నిస్తావా అంటూ కొందరు రెండు బెద్దలు కూడా వేసి అక్కడ నుండి వెళ్లి పోయారు.తాగిన మత్తు దిగడంతో గులామ్‌ సింగ్‌ సైలెంట్‌ గా పడుకున్నాడు.

తెల్లారిన తర్వాత భార్య పెద్ద మనుషుల్లో పెట్టి అతడికి చివాట్లు పెట్టించింది.అతడు తప్పు ఒప్పుకుని బార్య కాళ్లు పట్టుకుని ఇకపై తప్పుడు పనులు చేయను అంటూ ఒట్టేశాడు.