భార్యను గంగాలో ముంచి చంపేశాడు.. హత్యకు అతడు చెప్పిన కారణంకు పోలీసులే నోరు వెళ్లబెట్టారు  

Up Husband Kills Wife For Tantrik-

కంప్యూటర్‌ కాలం నడుస్తోంది.ఈ సమయంలో కూడా ఇంకా కొందరు మూడ నమ్మకాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.మూడ నమ్మకాలతో బాబాలు చెప్పిన పనులు చేయడం, ఇంకా క్షుద్ర పూజలు వంటివి చేయడం, నర బలులు ఇవ్వడం కూడా చేస్తున్నారు...

Up Husband Kills Wife For Tantrik--UP Husband Kills Wife For Tantrik-

అత్యంత రాక్షసులు ఇంకా భూమి మీద ఉన్నారు అంటూ నమ్మక తప్పదు.తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ఒక వ్యక్తి తనకు గుప్త నిధి దొరకాలనే ఉద్దేశ్యంతో బాబా చెప్పాడని భార్యను గంగా నదిలో ముంచేశాడు.ఆమెను చంపేసి నిధి సంగతి తర్వాత కాని జైల్లో కూర్చున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌ కు చెందిన మన్‌పాల్‌ సింగ్‌ మరియు రజనీలు భార్య భర్తలు.మన్‌పాల్‌ సింగ్‌కు పని చేతనవ్వదు.ఈజీ మని కోసం ప్రాకులాడుతూ ఒక బాబా చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు.ఆయన ఎప్పటికప్పుడు ఏదో ఒక పని చేయమనడం ఇతడు చేయడం చేస్తూ ఉంటాడు.

Up Husband Kills Wife For Tantrik--UP Husband Kills Wife For Tantrik-

అలా ఒకసారి నీ భార్యను నా వద్దకు తీసుకురా, ఆమెను నాతో పడుకోబెట్టు నీకు లక్షలు కలిసి వచ్చే మార్గం నేను చూపిస్తానంటూ హామీ ఇచ్చాడు.దాంతో మన్‌పాల్‌ డబ్బు ఆశతో ఆమెను మంత్రగాడి వద్ద పడుకోవాలంటూ బలవంతం చేశాడు.

మంత్రగాడి వద్దకు వెళ్లేందుకు రజనీ ససేమేర అనడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.ఏం చేయాలో పాలుపోలేదు.

అదే విషయాన్ని మంత్రగాడి వద్దకు వెళ్లి చెప్పగా, నీ భార్యను గంగా నదిలో ముంచేసి చంపేయి నీకు మహర్జాతకం పడుతుందని చెప్పాడు.దాంతో రజినీని నమ్మబలికి గంగానది వద్దకు తీసుకు వెళ్లి ఆమెను నీటిలో ముంచేశాడు.ఈత రాని రజినీ మునిగి పోయింది...

రజినీ మునిగి పోవడంతో తాపీగా అక్కడ నుండి వెళ్లి పోయాడు.రజినీ శవం బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.ప్రస్తుతం ఆ మంత్రగాడు మరియు మన్‌పాల్‌ జైల్లో ఉన్నారు.