పేదరికం ప్రాణం తీసింది.. గుండె తరుక్కుపోయే ఘటన. ?

పేదరికం ఆ బాలుడి ప్రాణం తీసింది.అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుని తల్లిదండ్రులకు పేదరికం దూరం చేసింది.

 Uttar Pradesh, Government Doctor, Child Died, Poverty,fever-TeluguStop.com

వైద్యం చేయించడానికి డబ్బులు లేక పోవడంతో అభంశుభం తెలియని చిన్నారి ప్రాణాలు వదలాల్సి వచ్చింది.ఈ ఘటన అందరిని కంటతడి పెట్టిస్తుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది ఈ విషాద ఘటన.

కాన్నౌజ్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ చాంద్ ఆశదేవి దంపతులకు ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు.చిన్నారికి ఉన్నట్టుండి ఒక్కసారిగా తీవ్ర జ్వరం రావడంతో కంగారు పడుతూ తల్లిదండ్రులు వెంటనే కన్నౌజ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా… అక్కడ వైద్యులు మాత్రం వైద్యం చేసేందుకు నిరాకరించారు.అక్కడినుంచి కాన్పూర్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

అక్కడ మెరుగైన చికిత్స అందుతుందని తెలిపారు.
కానీ కన్నౌజ్ ఆస్పత్రి నుంచి కాన్పూర్ ఆస్పత్రికి 90 కిలోమీటర్ల దూరం.

అంత దూరం తెసుకేళ్లేంత ఆర్థిక స్థోమత లేదు వారికీ.దీంతో వైద్యుల కాళ్లావేళ్లా పడి చికిత్స అందించాలని వేడుకున్నారు.

ఇక బాలున్ని వైద్యులు ఎమర్జెన్సీకి తరలించి కొద్దిసేపటికే బయటకి వచ్చి బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.దీంతో నేను ఒక పేద వాడిని నా దగ్గర డబ్బు లేదు నేనేం చేయగలను అంటూ ఏడాదిన్నర కొడుకు మృతదేహాన్ని గుండెలకు హత్తుకుని రోదించాడు ఆ తండ్రి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube