ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేసిన సర్కార్!

ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది ఉత్తరప్రదేశ్ సర్కార్.ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ కు ఆంబులెన్స్ లకు దారి ఇవ్వకపోవడం వంటి చర్యలకు పాల్పడితే 10 వేల రూపాయల వరకు జరిమానా విధిస్తుండగా ఇప్పుడు తాజాగా డ్రైవ్ చేస్తూ మొబైల్ మాట్లాడితే కూడా ఈ జరిమానా నే వర్తించేలా తాజాగా సర్కార్ నిర్ణయం తీసుకుంది.

 Uttar Pradesh New Traffic Rules,uttar Pradesh, Traffic Rules, Up Govt Double Fin-TeluguStop.com

ఎవరైనా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఇక వారికి భారీ జరిమానా విధించేవిధంగా యోగీ సర్కార్ అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.రాష్ట్రంలో తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాల రీత్యా యోగి సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

మొబైల్ మాట్లాడుతూ కారు డ్రైవ్ చేస్తే మొదటిసారి రూ.1000 జరిమానా విధించనుండగా,అలానే రెండోసారి ఇదే నేరానికి పాల్పడితే మాత్రం రూ.10,000 వసూలు చేయనున్నట్లు తెలుస్తుంది.అంటే మొదటిసారి ఇలాంటి తప్పు చేస్తే వెయ్యి రూపాయలు వసూలు చేసి రెండోసారి ఛాన్స్ ఇవ్వనుంది.

ఒకవేళ రెండోసారి కూడా ఇలానే మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసారో ఇక జేబులకు చిల్లులు పడినట్లే అని చెప్పాలి.అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులకు కూడా భారీ జరిమానాలు విధించే విధంగా సర్కార్ నిర్ణయం తీసుకుంది.

హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడిపినా ఇప్పటివరకు విధిస్తున్న జరిమానాలు రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది.అలానే పార్కింగ్ నిబంధనలు అతిక్రమించిన కూడా జరిమానాలు భారీగానే ఉండనున్నట్లు సమాచారం.

Telugu Double Fine, Uttar Pradesh-

లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా,స్పీడ్ లిమిట్ లను అతిక్రమించినా కూడా జరిమానాలు ఎక్కువగానే విధించనున్నారు.ప్రజల భద్రత, దృష్ట్యా ఇంత కఠిన నిబంధనలు అవసరమే అని, జరిమానా భారీగా ఉంటేనే ట్రాఫిక్ నిబంధనలను వాహన చోదకులు పాటిస్తారని అధికారులు పేర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube