పెళ్లి కొడుకు మెడలో వేయాల్సిన దండ ప్రియుడి మెడలో.. లైన్‌ లోకి చెల్లి, అతర్వాత జరిగిన పరిణామాలు తెలిస్తే నోరు వెళ్లబెడతారు

పీఠల వరకు వచ్చిన పెళ్లిల్లు ఆగి పోవడం పాత సినిమాల్లో ఎక్కువ జరుగుతూ ఉండేవి.పెళ్లి పిల్ల మెడలో వరుడు తాళి కడుతున్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి ఆపండి ఆపండి అంటూ పరుగెత్తుకు రావడం జరిగేది.

కాని ఇప్పుడు సినిమాల్లో అలాంటివి ఏమీ చూపించరు.ఒక వేళ చూపించినా కూడా ప్రేక్షకులు నవ్వుకునే పరిస్థితి.

ప్రేక్షకుల అభిరుచి మారింది, వారి అభిరుచికి తగ్గట్లుగా అలాంటి సీన్స్‌ను మేకర్స్‌ పెట్టడం లేదు.అయితే అలాంటి సంఘటన ఇప్పుడు నిజ జీవితంలో జరిగింది.

ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన చాలా విచిత్రంగా జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే… యూపీలోని ఉత్రౌలీ ప్రాంతంలో అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది.వివాహం తంతుకు రెండు సైడ్ల నుండి బందు మిత్రులు భారీగానే వచ్చారు.ఏర్పాట్లు భారీగా ఉన్నాయి.వరుడు కొత్తగా పెళ్లి కాబోతున్న ఉత్సాహంలో సంతోషంలో ఉన్నాడు.కాని వదువు మాత్రం కాస్త ఆందోళనగా కనిపించింది.

అయితే అంతా కూడా పెళ్లి అవుతుందనే భాద అయ్యి ఉండవచ్చు అనుకున్నారు.కాని ఆమె మరో వ్యక్తిని ప్రేమిస్తున్న విషయం వారు గుర్తించలేక పోయారు.

పెళ్లి సమయం దగ్గర పడినది, వదు వరులు పెళ్లి పీఠల మీదకు వచ్చారు.ఆ సమయంలోనే పూజారి పెళ్లి మంత్రాలతో పెళ్లి కార్యక్రమంను ఆరంభించాడు.ఇద్దరితో ముందస్తు పూజలు చేయిస్తున్నాడు.అంతా సాఫీగా సాగుతుందని మండపంలో ఉన్న వారు అంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు.అలాంటి సమయంలో పూజారి వరమాలలను వధు వరులకు ఇవ్వడం జరిగింది.దండలు మార్చుకోమని సూచించిన సమయంలో షాకింగ్‌ గా వధువు అక్కడ నుండి పరుగెత్తుకుంటూ పక్కింటికి వెళ్లింది.

పక్క ఇంట్లో ఉన్న తన ప్రియుడికి ఆ వరమాల వేసింది.వరమాల తీసుకుని పరుగెత్తుకుంటూ వెళ్లిన ఆమె వెంట బంధువులు మరియు ఇతరులు అంతా వెళ్లారు.అప్పటికే ఆమె ప్రియుడి మెడలో వరమాల వేసేసింది.దాంతో పెళ్లి కొడుకు తీవ్ర కోపోద్రిక్తుడు అయ్యాడు.తన పరువు తీశారని, తన బంధువుల మందు తాను తలెత్తుకోలేకుండా చేశారంటూ వధువు తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.దాంతో వధువు తండ్రి తన మరో కూతురును అతడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్దం అయ్యాడు.

అక్కకు నిశ్చయించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఆమె ఓకే చెప్పింది.దాంతో కొన్ని గంటల తేడాలో అక్క మెడలో కట్టాల్సిన తాళిని చెల్లి మెడలో ఆ వరుడు కట్టేశాడు.

మరోవైపు పెళ్లి పీఠల నుండి వెళ్లిపోయిన ఆమె ప్రేమను కుటుంబ సభ్యులు మాత్రం ఒప్పుకోవడం లేదు.అక్క స్థానంలో వెళ్లిన చెల్లి సంతోషంగా పెళ్లి చేసుకుంది, ప్రియుడితో పెళ్లి కోరుకున్న ఆమె మాత్రం ఏడుస్తూ కూర్చుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube