ఆ బైక్ లో కేవలం రూ. 5 తో 45 కిలోమీటర్లు ప్రయాణం షురూ...!

మోటార్ వాహనాలపై బయటికి వెళ్లాలంటే పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి.కరోనా నేపథ్యంలో బయటి వాహనాలపై ప్రయాణం కంటే సొంత బండిపై వెళ్తేనే సేఫ్ అని చాలా మంది భావిస్తున్నారు.

 With Rs.5 Travel 45 Kilometers On Air Bike, Air Bike, Lucknow, Bharat Raj Singh,-TeluguStop.com

కానీ, పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి.దీంతో బైక్ పై వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి.

అయితే పెట్రో ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో గాలితో నడిచే బైక్ అంటూ ట్విట్టర్ లో దుమారం రేపుతోంది.ఈ బైక్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ బైక్ కేవలం వాయి పీడనంతో నడుస్తుందని, ఒక్కసారి గాలిని నింపిన తర్వాత 45 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని బైక్ యజమాని పేర్కొంటున్నారు.

వాయు పీడనంతో నడిచే ఈ ప్రత్యేక బైక్ ను స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ డైరెక్టర్ జనరల్ భారత్ రాజ్ సింగ్ తయారు చేశారు.

లక్నో నగరానికి చెందిన ఆయన ఈ సరికొత్త బైక్ ను సృష్టించారు.వాయు పీడనం కోసం ప్రత్యేకంగా ఓ సిలిండర్ ను ఏర్పాటు చేశారు.ఈ సిలిండర్ లో గాలిని నింపితే చాలని బైక్ నడుస్తుందని ఆయన పేర్కొన్నాడు.గాలి నింపడానికి అయ్యే ఖర్చు కేవలం రూ.5 అని, బైక్ లో ఒక్కసారి గాలి నింపుకున్న తర్వాత సుమారు 45 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చన్నారు.గంటకు దీని వేగం 70 నుంచి 80 కిలో మీటర్ వరకు ఉంటుందని రాజ్ సింగ్ వెల్లడించారు.

ప్రస్తుత తరుణంలో ప్రజలు ఈ కొత్తరకం బైక్ ను ఇష్టపడుతారని, ఈ సమయంలో ఇలాంటి బైక్ వరం లాంటిదని రాజ్ సింగ్ అంటున్నారు.అయితే ఈ బైక్ ను 2008 లో పేటెంట్ కోసం పంపించానని, 10 సంవత్సరాల తర్వాత పేటెంట్ దొరికిందన్నారు.

ఈ మోడల్ బైక్ ను మేక్ ఇండియాకు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube