మా దేశంలోకి కరోనా రాలేదు, మాది కరోనా ఫ్రీ కంట్రీ

అందరిదీ ఒక దారి అయితే ఆయనది ఒకదారి.ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఉత్తర కొరియా నియంత కిమ్‌ అదే విధంగా వ్యవహరిస్తున్నాడు.

 Uttarkorea Health Deportment Announce The Corona Free Country, Uttar Korea, Chai-TeluguStop.com

ప్రపంచం మొత్తం కరోనాతో చిగురుటాకులా వణికి పోతుంది.కరోనా ప్రపంచం మొత్తం కరాళ నృత్యం చేస్తుంది.

ఇలాంటి సమయంలో కూడా ఉత్తర కొరియా మాత్రం అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితితో సహకరించడం లేదు.అసు తమ దేశంలో కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు అంటూ ప్రకటించారు.

కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియాలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.కరోనా పాజిటివ్‌ అని తెలిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చంపేస్తున్నారు.

కనీసం బాడీ కూడా దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కాంటాక్స్‌ కేసులు కూడా పెరగకుండా అత్యంత నిర్భందంగా వ్యవహరిస్తున్నారు అంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

కాని అవన్నీ కూడా పుకార్లే అని అసలు తమ దేశంలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసులు కూడా నమోదు కాలేదు అంటూ ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.చైనాలో వైరస్‌ ప్రారంభం అయిన సమయంలోనే మా దేశం అంతర్జాతీయ సరిహద్దులను మూసేయడం జరిగింది.

అందుకే ఇప్పుడు మేము కరోనా ఫ్రీ కంట్రీగా ఉన్నామని అన్నారు.ఈ సమయంలో కూడా ఉత్తర కొరియాలో క్షిపణుల పరీక్షలు జరుగుతున్నాయి.

మరో వైపు ప్రపంచ దేశాలు మాత్రం ఉత్తర కొరియా ప్రకటనను కొట్టి పారేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube