ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ గడ్డు పరిస్థితులకు దారి తీసిన ముఖ్య కారణాలు ఇవే?

వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్క వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.తెలంగాణ ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావించినప్పటికీ, నాయకత్వ లేమితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు సరికదా తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు.

 Congress Party, Uttam Kumar Reddy, Sonia Gandhi, Y.s. Rajasekhar Reddy, Congress-TeluguStop.com

ఈ వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా చేసింది.ఎంతలా అంటే ప్రజలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందా లేదా అనే స్థాయిలోనే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉందంటే కాంగ్రెస్ ఎంత తిరోగమనం చెందిందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత గడ్డు పరిస్థితులకు గల కారణాలు ఏమిటని ఒకసారి మనం విశ్లేషించుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నాయకుడు లేకపోవడం, నాయకత్వ లేమి ముఖ్య కారణం.

Telugu Congress, Fullsenior, Lack Leadership, Role, Ysrajasekhar-Telugu Politica

అంతేకాక వర్గ విబేధాలు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ నమ్మకం కోల్పోవడానికి ప్రధానమైన కారణం.పార్టీ సమావేశాలలో, మీడియా సమావేశాలలో బహిరంగంగానే వాగ్వివాదాలకు దిగడం, బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడం, ప్రభుత్వ విమర్శలకు ధీటైన సమాధానం ఇవ్వకపోవడం ఇలా చాలా కారణాలు ప్రస్తుత కాంగ్రెస్ గడ్డు పరిస్థితులకు ముఖ్య కారణాలని చెప్పుకోవచ్చు.ఇప్పుడు రాబోయే కొత్త నాయకకత్వం ముందు చాలా ఛాలెంజ్ లు ఉన్నాయి.

ఇప్పుడు క్షేత్ర స్థాయి నుండి కాంగ్రెస్ ను బలోపేతం చేస్తూ, బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తేనే ప్రజలు కాంగ్రెస్ గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయి.అంతేకాక ఇప్పుడు నియమింపబడే కొత్త నాయకత్వానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుల సంపూర్ణ మద్దతు దొరికితేనే మరల తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకొనే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube