తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు.. అంటున్న కాంగ్రెస్ కీలక నేత..!!

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఇప్పటికే బిజెపి పార్టీ నేతలు కామెంట్లు చేయడం తెలిసిందే.కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

 Uttam Kumar Reddy Sensatational Commentson Telangana Elections Details, Uttam Ku-TeluguStop.com

గతంలో 2014 ఎన్నికల తర్వాత 2018 లోనే.కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఒంటరిగా ప్రభుత్వాన్ని స్థాపించారు.

ఇప్పుడు ఇదే రీతిలో కేసీఆర్.ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే… టిఆర్ఎస్ పాలన మొత్తం శాండ్, ల్యాండ్, వైన్స్…చుట్టూ కేంద్రీకృతమై ఉందని విమర్శల వర్షం కురిపించారు.దోచుకో దాచుకో అన్నట్టుగా టిఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని మండిపడ్డారు.2023 నవంబర్ మాసంలో రావలసిన అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలలకు ముందు గానే వచ్చే స్పష్టమైన సంకేతాలు కనపడుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈసారి కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం కాంగ్రెస్ గెలవడం తథ్యమని జోస్యం చెప్పారు.

Uttam Kumar Reddy Sensatational Comments Uttam Kumar Reddy, Congress - Telugu Congress

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube