రైతులను కేసీఆర్‌ మోసం చేస్తున్నారు  

Uttam Kumar Reddy Comments On Kcr-telangana Congress Party,trs Party Chief,uttam Kumar Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అధికారం దక్కిన తర్వాత ఆ మాటలు పట్టించుకోవడం లేదు అంటూ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.తాజాగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Uttam Kumar Reddy Comments On Kcr-telangana Congress Party,trs Party Chief,uttam Kumar Reddy-Uttam Kumar Reddy Comments On KCR-Telangana Congress Party Trs Chief

ఎన్నికల సమయంలో రైతులకు రుణ మాఫీ అంటూ హామీ ఇచ్చి ఇప్పుడు రుణ మాఫి విషయాన్ని మర్చి పోయారు.ఇక రైతు బంధును రెండు సార్లు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ కేసీఆర్‌ను ఉత్తమ్‌ ప్రశ్నించాడు.

యువతకు ఓట్ల సమయంలో నిరుద్యోగ బృతి ఇస్తామంటూ ప్రకటించిన కేసీఆర్‌ కనీసం నిరుద్యోగులకు 16 రూపాయలు ఇవ్వలేదు అంటూ మండి పడ్డాడు.తెలంగాణలో 50 శాతం ఉన్న బీసీలకు ప్రభుత్వం ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఉత్తమ్‌ విమర్శించాడు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు 50 శాతం సీట్లను కేటాయించబోతున్నట్లుగా ప్రకటించాడు.మైనార్టీల కోసం కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.తెలంగాణ సమాజ మేధావులు అంతా కూడా కాంగ్రెస్‌లో జాయిన్‌ అవ్వాలి అంటూ ఉత్తమ్‌ పిలుపునిచ్చాడు.