రక్షించాల్సిన పోలీసులే భక్షించారు! యూపీలో దారుణం

ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడ చూసిన ఆడవాళ్ళ మీద వేధింపులు, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి.చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా కూడా ఉన్మాదులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు.

 Uthar Pradesh Gorakhpur Teacher-TeluguStop.com

ఈ ఘోరాలు నిత్యం ఎక్కడో ఒక చోట, ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి.ఇక ఇలాంటి ఘోరాలు జరిగే సమయంలో బాధితులని కాపాడి తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీసులు కూడా దారి తప్పుతున్నారు.

తమ హోదాని ఉపయోగించుకొని ఆబలలపై బలాత్కారం చేస్తున్నారు.అయితే తరువాత అత్యాచారం చేసిన అమ్మాయి మీద వేశ్య ముద్ర వేసి వేధింపులకి గురి చేస్తున్నారు.

భయపెట్టి కేసులు లేకుండా చేసుకుంటున్నారు.ఇలాంటి ఘటన ఇప్పుడు యూపీలో చోటు చేసుకుంది.

గోరఖ్‌పూర్ జిల్లాలోని గోరఖ్‌నాథ్‌‌లో ట్యూషన్ టీచర్ గా పనిచేస్తున్న 24 ఏళ్ల యువతి తన అక్క ఇంటికి వెళ్లి తిరిగొస్తోంది.ఆమె వెనక తల్లి కూడా వస్తుంది.

ఆ దారిలో ఒంటరిగా వెళ్తున్న ఆ యువతి పోలీసుల దృష్టిలో పడింది.ఇద్దరు పోలీసులు ఆమెను అడ్డుకొని భయపెట్టి నువ్వు వేశ్యవు కదా అని అడిగారు.

తాను అలాంటిదాన్ని కాదని, తానొక టీచర్ ని చెప్పిన వాళ్ళు వినలేదు.తన వెనకాల కొద్ది దూరంలో తల్లి కూడా వస్తోందని ఆ యువతి చెప్తున్నా పట్టించుకోకుండా బలవంతంగా బైక్ ఎక్కించుకొని రైల్వేష్టేషన్ దగ్గర్లోని ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆమె ప్రతిఘటించగా తీవ్రంగా గాయపరిచారు.తరువాత ఆమె చేతిలో 600 పెట్టి వెళ్లిపొమ్మన్నారు.

ఆమె ఆటోలో ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ కేసుని పోలీసులు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలి ఆరోపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube