అమెరికా పోలీసుల ఔదార్యం...వహ్వా అనాల్సిందే..!!!  

Utah Mom Calls 911 For Help With Baby Formula - Telugu Baby Formula, Feeding, Nri News, Police, Utah

అమెరికాను అగ్రరాజ్యమని అభివృద్ధిలో అన్ని దేశాల కంటే ముందు ఉందని ఎందుకు అంటారంటే.అక్కడ జరిగే ప్రతి పని,ప్రతీ వ్యవస్థ ఎంతో వేగంగా, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అత్యద్భుతంగా పనిచేస్తాయి.
ముఖ్యంగా అమెరికా పోలీసు వ్యవస్థ ప్రజల యొక్క అవసరాలను తీర్చడంలో వారికి భద్రతను కల్పించడంలో ఎంతో వేగంగా పనిచేస్తుంది.ఎలాంటి సమయంలోనైనా సరే అమెరికా పౌరులకు రక్షణ కల్పించడంలో వెనకడుగు వేయరు ఇలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది…
అమెరికాలోని షనం బర్డ్ రాష్ట్రంలోని పీక్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన నెలలు నిండిన పాపకు పాలు ఇద్దామంటే ఇంట్లో పాలు లేని పరిస్థితి నెలకొంది, బ్రెస్ట్ ఫీడింగ్ చేయలన్నా తన దగ్గర పాలు కూడా లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అమెరికా ఎమర్జెన్సీ నెంబర్ 9 11 కి కాల్ చేసింది.

Utah Mom Calls 911 For Help With Baby Formula - Telugu Baby Formula, Feeding, Nri News, Police, Utah-Telugu NRI-Telugu Tollywood Photo Image

తన పిల్లలకు పాలు పట్టించాలని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఈ సమయంలో బయటకు వెళ్లలేని పోలీసులకు విన్నవించింది దాంతో.

ఆ మహిళ యొక్క అవసరాన్ని అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లి ఆమెకు పాలడబ్బా ,బేబీ ఫార్ములాను ఇచ్చారు పోలీసుల సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.అది కాస్తా వైరల్ అవడంతో ఒక్క సారిగా ఆ పోలీసులు అమెరికాలో హీరోలు అయ్యారు.ఈ ఘటనపై స్పందిచిన నెటిజన్లు వాళ్ళు పోలీసులు కాదు హీరోలు అంటూ తెగ పొగిడేస్తున్నారు.

తాజా వార్తలు