ఏపీ ప్రభుత్వంపై సుప్రీం కోర్ట్ ఫైర్..!

ఏపీ ప్రభుత్వం పై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఏపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ దాఖలు చేయనందుకు ప్రభుత్వ తరపు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది.

 Supreme Court Fires On Ap Government About Affidavit On Exams, Affidavit , Ap Ex-TeluguStop.com

పరీక్షల నిర్వహణపై ఇన్ని రోజులవుతున్నా అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని సుప్రీం కోర్ట్ ఫైర్ అయ్యింది. రెండు రోజుల్లో దీనికి సంబందించిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

కరోనా నేపథ్యంలో ఒక్క విద్యార్ధి ప్రాణం పోయినా ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని సుప్రీం కోర్ట్ హెచ్చరించింది.

పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకున్నాయని ఏపీ ప్రభుత్వం మాత్రమే ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసులేదని అలా ఎందుకని ప్రశ్నించింది సుప్రీం కోర్ట్.

ఇతర రాష్ట్రాల నుండి ఏపీని ఎందుకు మినహాయించాలని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా లేదా చెప్పాలని ఆదేశించింది.అయితే ఇదే కేసుపై కేరళ ప్రభుత్వం సెప్టెంబర్ లో 11వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి సుప్రీం కోర్ట్ రెండు రోజుల్లో అఫిడవిట్ కోరింది.

 ఏపీ ప్రభుత్వం తమ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది.అయితే మిగతా రాష్ట్రాలు మాత్రం పరీక్షలను రద్దు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube