యూఎస్-మెక్సికో బోర్డర్‌లో దారుణం: 9 మంది మోర్మాన్ కమ్యూనిటీ సభ్యుల ఊచకోత  

Us Mormon Family Killed In The Us Mexico Border-nri,telugu Nri News Updates,us Mexico Border,us Mormon Family

యూఎస్-మెక్సికన్ సరిహద్దుల్లో దారుణం జరిగింది.మోర్మాన్ కమ్యూనిటీకి చెందిన కుటుంబసభ్యులతో వెళుతున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేయడంతో 9 మంది దుర్మరణం పాలయ్యారు.

Us Mormon Family Killed In The Us Mexico Border-nri,telugu Nri News Updates,us Mexico Border,us Mormon Family Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా -US Mormon Family Killed In The Mexico Border-Nri Telugu Nri News Updates Us Border Us

వీరంతా అమెరికా-మెక్సికన్ పౌరసత్వం ఉన్నవారిగా పోలీసులు తెలిపారు.మెక్సికోలోని సోనోరా, చివావా రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్న మూడు వాహనాలపై సియెర్రా మాడ్రే ఆక్సిడెంటల్ ప్రాంతం వద్ద క్రిమినల్ గ్రూపులు దాడి చేసినట్లు చివావా రాష్ట్ర అటార్నీ జనరల్ సీజర్ పెనిచే ఒక ప్రకటనలో తెలిపారు.

మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు, మైనర్లే ఉన్నారని ఆయన వెల్లడించారు.ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అలెక్స్ లెబరోన్ మీడియాతో మాట్లాడుతూ.

దుండగులు మూడు వాహనాలను లక్ష్యంగా చేసుకుని ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు, ఇద్దరు శిశులను బలీ తీసుకున్నారని చెప్పారు.మహిళలను చిన్నారులను ఊచకోత కోసిన అనంతరం కొందరిని దుండగులు సజీవదహనం చేశారని అలెక్స్ వెల్లడించారు.

సమాచారం అందుకున్న అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఏడుగురు చిన్నారులను పోలీసులు మెక్సికోలోని ఆసుపత్రికి అనంతరం డగ్లస్‌కు తరలించారు.అయితే ఇక్కడ ప్రత్యర్ధులుగా ఉన్న రెండు వేర్వేరు గ్రూపులు వాహనాల్లో వెళుతున్న వారిని తమ శత్రువులుగా భావించి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ దాడి మారుమూల ప్రాంతంలో జరగడంతో క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని పెనిచే తెలిపారు.కాగా ఈ ప్రాంతంలో తీవ్ర హింసాకాండ జరుగుతోంది.

గత నెలలో పశ్చిమ రాష్ట్రమైన మిచోవాకాన్‌లో 13 మంది మెక్సికన్ పోలీసు అధికారులను దుండగులు కాల్చిచంపారు.ఆ ఘటన తర్వాత ఇదే అతిపెద్ద దాడి.మరోవైపు గతేడాది మెక్సికోలో క్రిమినల్ గ్రూపుల హింస కారణంగా 33,000 మంది మరణించగా.ఈ సంవత్సరం సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు