ఒక కంపెనీ ఫోన్ ఛార్జర్‌ను వేరొక ఫోన్‌కు వాడితే ఇంత ప్రమాదమా.. ?

మనలో చాల మందికి ఉన్న అలవాటు ఏంటంటే.ఒక ఫోన్ ఛార్జర్ మరో ఫోన్‌కు ఉపయోగిస్తారు.

 Using, Another, Mobile Charger, Kills, Battery Life Time-TeluguStop.com

ఈ పనిని చేయని వారంటు ఉండరు.

పొరబాటున అలా ఒక ఛార్జర్ మరో ఫోన్‌కు ఉపయోగించ వద్దని చెబితే చెప్పిన వారు పిసినారులుగా, వేస్ట్ ఫెలోలుగా మిగిలిపోతారు.

ఎవరు ఏమనుకున్న ఇలా ఇష్టం వచ్చినట్లుగా మరో కంపెనీ ఛార్జర్లు ఉపయోగిస్తే మాత్రం సెల్ పాడవడం మాత్రం ఖాయమంటున్నారు నిపుణులు.బ్యాటరీ దెబ్బ తినడాకిని, ఛార్జింగ్ సరిగా లేకపోవడానికి కారణం ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఛార్జర్ కాకుండా వేరే కంపెనీ ఛార్జర్లు పెట్టడం.

ఇకపోతే ప్రతి కంపెనీ ఫోన్ కు ఒక చార్జర్ ఉంటుంది.

అది కేవలం ఆ కంపెనీ ఫొన్ లకు మాత్రమే ఛార్జింగ్ చేసుకోవడానికి వినియోగించాలి.

ఆలా కాదని ఇతర ఫొన్ లకు కూడా వాడినట్టయితే కొంతకాలానికి ఛార్జింగ్ సరిగా లేక బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందట.ఎందుకంటే ప్రతి సెల్ కంపెనీ ఆ ఫొన్ రెసిస్టెన్స్ ప్రకారం చార్జర్ ను తయారు చేస్తాయి.

అంతే కాకుండా ఫోన్ నుంచి వచ్చే హీట్ ను తగ్గించుకోవడానికి వాడే ‘హీట్ సింక్’ సామర్ధ్యం ఎంత ఉంటుందో.అందుకు తగ్గట్టే ఫోన్ చార్జర్ కూడా తయారు చేస్తారు.

ఇలా ఒక్కో కంపెనీ ఫోన్ కు ఒక్కో విధంగా తయారు చేయబడుతుందట.అయితే ఇలాంటి తప్పుపని చేయడం వల్ల బ్యాటరీ ఉబ్బడం, ఫోన్లో ఉండే రేడియేషన్ ఒకదాని ద్వారా మరొక ఫోన్ కు వ్యాపించడం జరుగుతుందట.

దీని కారణంగా ఫోన్ హ్యాంగ్ అవడం, ఒక్కోసారి ఫోన్ సాఫ్ట్ వేర్ పనిచేయకుండా పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు.కాబట్టి మీ సెల్‌తో వచ్చిన ఛార్జరే వాడండని నిపుణులు పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube