నల్ల దారం కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే...

మన హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం చాలామంది నల్ల దుస్తులను ధరించడానికి ఇష్టపడరు.అలా నల్ల దుస్తులు ధరించడం వల్ల చెడు జరుగుతుందన్న భావనలో ఉంటారు.

 Benefits Of Wearing Balck Thread On Leg, Wearing Black Thread, Hindu Rituals, Hi-TeluguStop.com

కానీ చాలామంది నలుపురంగు ధారాలను మెడలో, కాలికి, నడుముకు కట్టుకుని ఉంటారు.ఇలా కట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఇలా నల్లటి దారాలను ధరించడం మన పూర్వీకుల నుంచి ఒక సాంప్రదాయంగా వస్తోంది.అయితే ప్రస్తుతం ఈ నల్లటి దారాలను అందంకోసం కట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం.

అయితే ఈ నల్లటి దారాలను కట్టుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా నలుపు రంగు శనీశ్వరునికి ప్రతీక.ఇటువంటి నలుపు దారాన్ని ధరించేముందు ముందుగా ఆ శని దేవునికి నమస్కరించి ఏదైనా ప్రత్యేక రోజులు అంటే అమావాస్య, పౌర్ణమి రోజును పురస్కరించుకుని కట్టుకుంటారు.

ఇలా అమావాస్య పౌర్ణమి రోజు కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని భావిస్తారు.శనీశ్వరునికి సమర్పించిన ఈ నల్లటి దారాలను ధరించడం ద్వారా మన పై ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

Telugu Astrology, Benefitsbalck, Black Thread, Hindu, Hindu Rituals, Sampradayam

ఈ దారాన్ని ధరించడం ద్వారా ఆ శనీశ్వరుని అనుగ్రహం కలిగి శని నుంచి విముక్తి కలుగుతుంది.ఈ నల్లటి దారాలను మగవారు నడుము భాగంలోనూ ధరిస్తారు.ఈ నల్లటి దారాన్ని ధరించిన తర్వాత శ్రీ గాయత్రి మంత్రాన్ని పఠించాలి.ఈ నల్లటి దారాలను స్త్రీలు ఎడమ కాలికి, పురుషులు కుడికాలికి ధరిస్తుంటారు.ఇలా ధరించడం వల్ల కొన్ని దుష్ట శక్తుల నుంచి మనల్ని దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.మరికొందరు ఆ హనుమంతుని రూపాన్ని నల్లటి దారంలో వేసుకొని మెడలో ధరించడం ద్వారా ఎటువంటి పీడకలలు రాకుండా ఎంతో ధైర్యంగా ఉంటారు.

కొందరు చేతి మణికట్టుకు ఎరుపు పసుపు నారింజ రంగులతో కలసి ఉన్న దారాలను కట్టుకొని ఉంటారో అలాంటివారు మణికట్టుకు నల్లటి దారాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube