అలెర్ట్: పరిమితికి మించి యాపిల్స్ తింటే అనర్థమే..!

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినేది యాపిల్.వైద్యుల సూచన ప్రకారం ప్రతిరోజూ కనీసం ఓ యాపిల్ తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవనే వాస్తవం పలు అధ్యయనాల్లో తేలింది.

 Useless To Eat Apples Beyond The Limit Alert, Apple, Eating, Health Tips, Health-TeluguStop.com

ఇక రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదనే వాదన కూడా ఉంది.ఇందులో పుష్కలంగా లభించే మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, విటమిన్లు శరీరానికి ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి.

అయితే కొందరు అదే పనిగా లాగించేస్తుంటారు.దీని వల్ల లాభాల మాట అటుంచితే కొత్త అనర్థాలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

యాపిల్‌లో ఫైబర్(పీచు పదార్థాలు) అధిక మోతాదులో ఉంటుంది.ఫలితంగా దీనిని తింటే జీర్ణ క్రియలు సాఫీగా ఉంటాయనేది వాస్తవం.అయితే రోజుకు 3 నుంచి 4 యాపిళ్లను అదేపనిగా తింటే మాత్రం జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి.కడుపు ఉబ్బరం తలెత్తి, మలబద్ధకం ఏర్పడుతుంది.

ఇలా రోజుకు 70 గ్రాములకు మించి ఫైబర్ శరీరంలో చేరితే ఈ దుష్ప్రభావాలు తలెత్తుతాయి.అంతేకాకుండా యాపిల్స్ అధికంగా తింటే డయాబెటిస్ ఉన్న వారికి ఇబ్బంది.

ఇందులో ఉండే కార్పొహైడ్రేట్స్ బరువును పెంచుతాయి. యాపిల్స్‌లో ఉండే ఆమ్ల శాతం దంతాల పటిష్టతను దెబ్బతీస్తుంది.

Telugu Apple, Care, Tips, Healty-Telugu Health

యాపిల్స్ తింటే ప్రయోజనాలెన్నున్నాయో అధికంగా లాగిస్తే అన్నే దుష్ప్రభావాలు ఉన్నాయి.దీని వల్ల మితంగా తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.ముఖ్యంగా కడుపు ఉబ్బరం సమస్య ఉంటే యాపిల్స్‌ను అధికంగా తినకపోవడమే మంచిదని వారు పేర్కొంటున్నారు.యాపిల్స్ విత్తనాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.యాపిల్ తినే సమయంలో విత్తనాలను మింగితే తలనొప్పి, కడుపు నొప్పి కూడా వస్తాయి.అందువల్ల యాపిల్స్‌ను తినేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube