కంప్యూటర్ స్లో అయితే ఈ చిట్కాలు ఉపయోగించండి

కంప్యూటర్ కొన్న కొన్నాళ్ళకు నెమ్మదిస్తుంది.కంప్యూటర్ పనితీరుపై సరైన అవగాహన లేనివారు ఇది అందరికీ జరిగేదే అని గమ్మునుంటారు.

 Useful Tips For A Slow Running Computer-TeluguStop.com

కాని అవగాహన ఉన్నవారు ఇది పరిష్కరించేదాకా ఉరుకోరు.ఎందుకంటే వారికి తెలుసు, మన చేసే తప్పులకే తప్ప, సిస్టమ్ ఊరికే స్లో అవదు.

మీ కంప్యూటర్ గనుక నెమ్మదిస్తే ఈ చిట్కాలు పాటించండి.

* టాస్క్ మెనేజర్ ఓపెన్ చేసి ఏ అప్లికేషన్ వలన సిస్టమ్ మీద ఒత్తిడి పెరుగుతోందో, ఏ అప్లికేషన్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడండి.

ఒత్తిడి పెంచుతున్న అప్లికేషన్స్ స్టార్ అప్ లోనే రన్ అవకుండా ఆపేయండి.వాటి అవసరం పెద్దగా లేకపోతే అన్-ఇన్స్టాల్ చేయండి.

* అన్ వాంటెడ్ ఫైల్స్, క్యాచీ ఫైల్స్ ఎప్పటికప్పుడు డిలీట్ చేయండి.RUN లోకి వెళ్ళి %temp% అని టైప్ చేస్తే కంప్యూటర్ లోని చెత్త చెదారమంతా బయటపడుతుంది.

ఏరిపారేయండి.

* కుదిరితే CC cleaner లాంటి యాప్ వాడండి.

అనవసరపు చెత్త సంగతి ఇదే చూసుకుంటుంది.లేదంటే మీరే run లోంచి క్యాచీ ఫైల్స్ ని, బ్రౌజర్ హిస్టరీని తీసేయండి.

* ఎలాంటి థర్డ్ పార్టీ ఎక్స్టెన్షన్స్ వాడొద్దు.అల్రెడి ఎక్స్ టెన్షన్స్ ఉన్న అప్లీకేషన్ కంప్యూటర్ లోంచి తీసేసి మళ్ళీ ఇంస్టాల్ చేసుకోండి.

* హార్డ్ డిస్స్ ని పూర్తిగా నింపేయవద్దు.ఇలా చేసినా కంప్యూటర్ స్లో అయిపోవచ్చు.

అవసరం లేని డేటాని హార్డ్ డిస్క్స్ నుంచి తీసేయండి.

* మాల్వేర్స్ ఉన్నాయో చూడండి, ఒక్క అప్లికేషన్ వలన ప్రాబ్లమ్ ఉన్నా, అది మొత్తం సిస్టమ్ ని చెడగొట్టొచ్చు.

* మల్టిటాస్కింగ్ మేనేజ్‌మెంట్‌ ముఖ్యం.అది ర్యామ్ సైజ్ ని బట్టి, మీరు వాడే అప్లికేషన్స్ ని బట్టి ఉంటుంది.

ర్యామ్ పై ఎక్కువ ఒత్తిడి పడకుండా మల్టిటాస్కింగ్ చేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube