మైసూర్ బజ్జీ ఆయిల్ పీల్చకుండా హోటల్ మాదిరిగా మెత్తగా మృదువుగా రావాలంటే....ఇలా చేయాలి

మైసూర్ బజ్జీ ఆయిల్ పీల్చకుండా మెత్తగా రావాలంటే…మైదా పిండిలో పుల్లటి పెరుగు కలిపి 20 నిమిషాల పాటు నానబెట్టాలి.అప్పుడు మంచి రుచి,రంగు రావటమే కాకుండా హోటల్ లో ఉండే మైసూర్ బజ్జీలా తయారవుతుంది.

 Useful Cooking Tips-TeluguStop.com

సాంబార్ రుచిగా రావాలంటే ఒక చిన్న చిట్కా ఉంది.మనం సాంబార్ తయారు చేసినప్పుడు కందిపప్పును ఉపయోగిస్తాం.కందిపప్పుతో సమానంగా పెసరపప్పును ఉపయోగిస్తే సాంబార్ మంచి రుచి వస్తుంది.

ఇడ్లిలు మెత్తగా మృదువుగా రావాలంటే ఇడ్లి పిండిని రాత్రి సమయంలో రుబ్బి ఆలా ఉంచి ఉదయమే ఇడ్లిలు వేసుకుంటే పిండి బాగా పులిసి ఇడ్లిలు మెత్తగా మృదువుగా వస్తాయి.


పెరుగు హోటల్స్ లో గట్టిగా చాలా టేస్టీ గా ఉంటుంది.అదే మన ఇంటిలో పెరుగు తోడు పెడితే పుల్లగా ఉంటుంది.పెరుగు పుల్లగా లేకుండా మంచి టెస్ట్ గా ఉండాలంటే పెరుగు తోడు పెట్టె సమయంలో చిటికెడు పంచదార వేస్తె పెరుగు కమ్మగా టేస్టీగా ఉంటుంది.

నిమ్మరసం పిండేసిన నిమ్మ తొక్కలను కుక్కర్ అడుగు భాగంలో వేస్తె కుక్కర్ వాసన రాకుండా ఉంటుంది.

అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఉప్పు,పసుపు కలపాలి.

వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ముక్కలు కోసిన నీటిలో రెండు స్పూన్ల పాలను కలపాలి.

క్యాబేజి ఉడికించేటప్పుడు వాసన విపరీతంగా వస్తుంది.క్యాబేజి ఉడికించేటప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తె వాసన రాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube