దేవుడా: చేతికి వేసుకొనే గ్లౌజ్ లను కూడా కల్తీ చేస్తున్న గ్యాంగ్...!

ప్రపంచంలో రోజురోజుకి ప్రతి విషయంలో కల్తీ జరగడం మరీ ఎక్కువ అవుతుంది.ఇప్పటివరకు మనం వాడే నీరు, తిండి, సబ్బు ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి ఒక్క దానిలో కల్తీ మాఫియా చెలరేగి పోతుంది.

 Used Gloves Meant For Resale, Mumbai, Used Gloves,-TeluguStop.com

ఆహారం కల్తీ చేయడం ద్వారా అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.ఈ కల్తీ వ్యాపారం ద్వారా అనేకమంది రోగాల బారిన పడి హాస్పిటల్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే…

కరోనా వైరస్ మొదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా మాస్క్ లు, చేతికి గ్లౌజులు వేసుకోవడం చాలా పరిపాటిగా మారింది.అయితే ఇలా వాడి పడేసిన వాటిని కడిగి, మళ్లీ వాటిని విక్రయించడాన్ని మహారాష్ట్రలోని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు చేధించారు.

ముంబై నగరం లోని ఆస్పత్రిలో వైద్యులు, రోగులు విరివిగా ఉపయోగిస్తునే ఉంటారు.అయితే వాటి వాడకం పూర్తయిన తర్వాత, వాటిని వారి చేతుల నుంచి తొలగించుకొని చెత్త కుప్పలో వేస్తారు.

అయితే చెత్త కుప్ప ను డంపింగ్ యార్డుకు హాస్పిటల్ లో పనిచేసే సానిటరీ వర్కర్స్ ద్వారా డంపు యార్డ్ కు తరలిస్తున్నారు.అయితే అక్కడ ఓ గ్యాంగ్ అలా వచ్చిన చెత్తను ఆసుపత్రి దగ్గర నుంచి నేరుగా వాటిని సేకరించి కల్తీ చేయడం మొదలుపెట్టారు.

ముంబై నగరంలోని పాప్ నే అనే ప్రాంతంలో ఓ గొడౌన్ వద్ద జరిగిన పోలీసుల దాడిలో ఏకంగా మూడు టన్నుల చేతి గ్లౌజ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇక ఈ విషయం గురించి పూర్తి విచారణ జరపగా డంపుయార్డ్లో సేకరించిన వాటిని నీటిలో కడిగి తిరిగి మళ్ళీ ప్రజలకు అమ్ముతున్నట్లు వారు అంగీకరించారు.

ఇందులో కొన్ని కరోనా పేషంట్స్ వాడిన చేతి గ్లౌజులు కూడా సేకరించి అమ్మినట్లు తెలుస్తోంది.రోజురోజుకు పరిస్థితి ఇలా జరుగుతుంటే సామాన్య ప్రజలు ఎలా బతకాలో ఎలా జీవించాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

కల్తీ చేసిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆసుపత్రులకు వెళితే అక్కడ కూడా కల్తీ సౌకర్యాలు అందించడంతో ప్రజలకు ఏం చేయాలో అర్థం కావట్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube