వాట్సాప్‌ ను వ్యక్తిగత డైరీగా ఇలా వాడేసుకొండి..!  

use whatsapp as your personal dairy like this, whatsapp, new update, browser, dairy, photos, media, documents, personal dairy, messages, chat, videos, media, store, privacy policy - Telugu Chat, Dairy, Documents, Media, Messages, New Update, Personal Dairy, Photos, Privacy Policy, Store, Videos, Whats App

వాట్సాప్ తాజాగా తీసుకువచ్చిన కొన్ని కొత్త ప్రైవసీ పాలసీ విధానాల దెబ్బకి ఇన్స్టెంట్ మెసేజ్ యాప్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పవచ్చు.ప్రైవసీ పాలసీ విధానం సంబంధించి ఎంతో మంది యూజర్లు వాట్సాప్ నుండి ఇతర మెసేజ్ ఇన్ యాప్స్ అయిన టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్స్ కు మారిపోతున్న సంగతి మనం గమనిస్తూనే ఉన్నాం.

TeluguStop.com - Use Whatsapp As A Personal Diary Like This

కొత్త విధానాలు, నూతన విధానాన్ని పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకించడంతో వాట్సప్ కాస్త వెనకడుగు వేసిందని చెప్పవచ్చు.ఇందులో భాగంగానే వాట్సాప్ తన నూతన ప్రైవసీ విధానాన్ని మే నెల వరకు వాయిదా వేసింది.

ఇందులో భాగంగానే యూజర్ యొక్క డేటా కు సంబంధించి ఎలాంటి భంగం వాటిల్లదని వాట్సాప్ ప్రకటించింది.ఇక అసలు విషయంలోకి వెళితే.ఎన్ని యాప్స్ వాట్సాప్ కి పోటీ వచ్చిన వాట్సాప్ పై ఉన్న క్రేజ్ ప్రజలకు అంతా ఇంతా కాదు.వాట్సప్, ఫేస్బుక్ చేతికి వచ్చిన తర్వాత ఎన్నో అప్డేట్స్ ను ఇస్తూనే ఉంది.

TeluguStop.com - వాట్సాప్‌ ను వ్యక్తిగత డైరీగా ఇలా వాడేసుకొండి..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగానే వాట్సాప్ ను మనం వ్యక్తిగత డైరీ గా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది.కేవలం ఒక చిన్న ట్రిక్ ఉపయోగించడం ద్వారా మీ వాట్సాప్ ను మీ పర్సనల్ డైరీగా ఉపయోగించుకొని మీ మెసేజ్లు, ఫొటోలు ఇతర పత్రాలను అందులో భద్రపరుచుకోవచ్చు.

అది ఎలానో ఓసారి చూద్దామా.

ముందుగా మీ మొబైల్ లోని బ్రౌజర్ ఓపెన్ చేసుకొని, అందులో wa.me// ను ఓపెన్ చేసి మీ దేశం యొక్క కోడ్ తో సహా మీ ఫోన్ నెంబరు నమోదు చేసి లాగిన్ అవ్వాలి.లాగిన్ అయిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

అందులో కంటిన్యూ చాట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే దాంతో మీరు నేరుగా మీ వాట్సప్ అకౌంట్ ఓపెన్ చేయబడుతుంది.అందులో మీ సొంత మొబైల్ నెంబర్ కూడా మీకు ప్రత్యక్షమవుతుంది.

అక్కడ మీరు సాధారణ చాట్ లాగానే ఫోటోలు, టెక్స్ట్ మెసేజ్ లు, వీడియోలు లేదా ఇతరత్రా ఫైళ్లను పంపుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు.దీంతో మీరు మీ చాట్ చేసుకునే సదుపాయం కూడా వాట్సప్ కల్పిస్తుంది.

కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా అవసరమైన సమయాలలో నోట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీ చాట్ లో డైరెక్ట్ గా  టైప్ చేసుకుంటే దానిని డైరీలా మార్చుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి.

#Privacy Policy #Messages #Videos #Store #Whats App

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు