కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి హైదరాబాద్ లో పోజిటివ్ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ భయంతో వణికిపోతున్నారు.ప్రతి విషయంలో నిర్లక్ష్యంగా ఉండే తెలుగు ప్రజలు కరోనా వైరస్ భయంతో ఎక్కువగా మాస్క్ లలో కనిపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కనీసం హెల్మెట్ పెట్టుకొని ప్రజలు కరోనా వైరస్ వచ్చింది అనగానే మాస్క్ లు పెట్టేసుకుంటున్నారు అని ఇప్పుడు మన ఇండియన్ ప్రజల మీద సోషల్ మీడియాలో ఆసక్తికరమైన కామెంట్స్ ట్రోల్స్ కనిపిస్తున్నాయి అంటే మనవాళ్ళ అతి జాగ్రత్త ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.అలాగే చేతులు ఎప్పుడు సరిగ్గా కదగాకుండానే భోజనాలు చేసేవాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు లిక్విడ్ తో చేతులు కడుతున్నారు.
ఇవన్ని కాస్తా అతిగా ఉన్న మన తెలుగు ప్రజలు ఇలాంటి అతి జాగ్రత్తల విషయంలో ముందుంటారు.ఇదిలా ఉంటే మార్చి అంటే పెళ్ళిళ్ళ సీజన్.విపరీతంగా బంధువులు పెళ్లి వేడుకకి వస్తూ ఉంటారు.వారిలో ఎవరికీ కరోనా ఉంటే ఇక అంతే సంగతులు.
అసలే ప్రస్తుత పరిస్థితిలో గుంపులుగ ప్రజలు తిరగొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపధ్యంలో కరీంనగర్ ఓ పెళ్లి వేడుకలో కనిపించిన దృశ్యం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే జనసమూహంలో ఉన్నప్పుడు మాస్కులు ధరించాలన్న వైద్యుల సూచనలను నవ దంపతులు కీర్తన, అభినవ్ ఫాలో అయ్యారు.మాస్కులు ధరించి పెళ్లి చేసుకున్నారు.
కరీంనగర్‌లోని ఓ కల్యాణమండపంలో జరిగిన పెళ్లిలో వధూవరుల తల్లిదండ్రులు కూడా ఇలా మాస్కులు ధరించారు.ఇక అక్కడికి వచ్చిన బంధువులు వారిని చూసి తాము కూడా ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని ఆలోచించారు.