బయటపడ్డ కరోనా కణం గుట్టు.. మాస్క్ వాడలేదంటే అంతే సంగతులు!  

USe Mask and Sanitizer to get out of Corona,mask, social distance, sanitizer, corona virus, covid-19 - Telugu Corona Virus, Covid-19, Mask, Sanitiser, Sanitizer, Social Distance, Use Mask And Sanitizer To Get Out Of Corona

ప్రపంచ దేశాల ప్రజలు కరోనా మహమ్మారి వల్ల పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.వైరస్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరి నుంచి సోకుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

 Use Mask For Get Out Of Corona Virus

మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకుంటే మాత్రమే వైరస్ సోకకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది.శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి పరిశోధనలు చేస్తున్నారు.

శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఆసక్తికరమైన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడగా లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.

బయటపడ్డ కరోనా కణం గుట్టు.. మాస్క్ వాడలేదంటే అంతే సంగతులు-General-Telugu-Telugu Tollywood Photo Image

కరోనా వైరస్ రూపాన్ని మార్చుకుంటూ ఉండటం వల్ల మనుషులు ఇబ్బందులు పడుతున్నారు.కరోనా వైరస్ అయినా లోపల జన్యువులతో పైన ప్రోటీన్ పొరతో కప్పబడి ఉంటుంది.

పరిశోధకులు కరోనా వైరస్ లోపల ఉండే జన్యువులపై కూడా పరిశోధనలు చేస్తున్నారు.శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధనలో కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించిన తరువాత శరీరంలో వైరస్ ఉత్పత్తిని పెంచుకుంటోందని… యాక్టివ్ గా లేని కణాలపై దృష్టి పెట్టి కరోనా శరీరంలో వైరస్ ఉత్పత్తిని అంతకంతకూ పెంచుకుంటోందని వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరిస్తే మాత్రమే కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుందని… సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజలకు వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనాను నియంత్రించడం సాధ్యమవుతుందని తెలుపుతున్నారు.నార్త్ కరోలినా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు.

అందుకే బయటకు వచ్చిన సమయంలో ఖచ్చితంగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించండి.ఏదైనా వస్తువు ముట్టుకున్నా, ఎవరినైనా ముట్టుకున్నా తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకుంటే మంచిది.

#Corona Virus #USeMask #Social Distance #Sanitizer #Mask

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Use Mask For Get Out Of Corona Virus Related Telugu News,Photos/Pics,Images..